Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, మే9, 2023: టాటా గ్రూప్‌నకు చెందిన,ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్‌ ఎలకాక్ట్రానిక్స్‌ రిటైలర్‌ క్రోమా, తమ నూతన స్టోర్‌ను సికింద్రాబాద్‌లో తెరిచినట్లు వెల్లడించింది. ఈ స్టోర్‌ నాచారం మల్లాపూర్‌ రోడ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎదురుగా, న్యూ రాఘవేంద్ర నగర్‌, శ్రీ సాయి నగర్‌, సికింద్రాబాద్‌ వద్ద ఉంది. ఇది సికింద్రాబాద్‌లో క్రోమాకు 4వ స్టోర్‌ కాగా, తెలంగాణాలో 24వ స్టోర్‌ఇది.

నగరంలో మొట్టమొదటి జాతీయ స్ధాయి లార్జ్‌ ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌గా నిలిచిన క్రోమా , 550 కు పైగా బ్రాండ్ల వ్యాప్తంగా 16వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

క్రోమా నాచారం స్టోర్‌12000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్ధులలో ఉంది. ఇక్కడ వినియోగదారులు అత్యున్నత అనుభవం, నైపుణ్యం కలిగిన క్రోమా ఎక్స్‌పర్ట్స్‌ నుంచి కొనుగోలు సమయంలో అవసరమైన సహాయాన్నిపొందగలరు. ఈ స్టోర్‌లలో వినియోగదారులు తాజా శ్రేణి ఉత్పత్తులను అన్వేషించవచ్చు.

వీటిలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు,డిజిటల్‌ ఉపకరణాలు, కూలింగ్‌ సొల్యూషన్స్‌, గృహోపకరణాలతో పాటుగా ఆడియో మరియు సంబంధిత యాక్ససరీలు ఉంటాయి. క్రోమా కొనుగోలు అనంతర సేవలను సైతం వీరు పొందడంతో పాటుగా నైపుణ్యంతో కూడిన సలహాలను సైతం పొందవచ్చు.

క్రోమా ఇన్ఫినిటీ రిటైల్‌ లిమిటెడ్‌, ఎండీ సీఈఓ అవిజిత్‌ మిత్రా మాట్లాడుతూ‘‘ మా నూతన స్టోర్లను సికింద్రాబాద్‌ లోని నాచారం వద్ద ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించడం ద్వారా మా వినియోగదారులకు మరింత సన్నిహితంగా చేరడంతో పాటుగా మా అత్యున్నత శ్రేణి, వినూత్నమైన ఉత్పత్తులు, ఆఫర్లును అందిస్తున్నాము. ఇది అనుసంధానిత ,నమ్మక ఆధారిత అనుభవాలను అందించనున్నాము. మా

వినియోగదారులకు అత్యున్నత శ్రేణి, సమగ్రమైన షాపింగ్‌ అనుభవాలను అందించాలన్నది మా ప్రయత్నం. దేశవ్యాప్తంగా మేము మా కార్యకలాపాలను విస్తరించడంతో పాటుగా క్రోమా డాట్‌ కామ్‌తో ద్వారా వృద్ధి చెందుతున్న వినియోగదారుల డిమాండ్‌ను అందుబాటు ధరలో తీర్చనున్నాము’’ అని అన్నారు.

ఉత్సాహపూరితమైన రాయితీలతో పాటుగా స్టోర్స్‌ ,వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న క్రోమా మ్యాజికల్‌ సమ్మర్‌ లైవ్‌ తో వినియోగ దారులు తమ అభిమాన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను అందుబాటు ధరలో పొందవచ్చు. క్రోమా నాచారం స్టోర్‌ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఏడు రోజులూ తెరిచి ఉంటుంది.

error: Content is protected !!