Wed. Jun 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 8 మే 2023: అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీ ని రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లో మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ, సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ మాట్లాడుతూ సర్కారు ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికి వదిలేసి ప్రైవేటు యూనివర్సిటీలకు తొత్తులుగా మారి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.

యూనివర్సిటీ పాటించవలసిన ఏ నిబంధనలు కూడా పాటించడం లేదని ఒక క్యాంపస్ కు మినిమం 10 ఎకరాల భూమి ఉండాలి, సింగిల్ డొమైన్ అయితే 10 ఎకరాల భూమి ఉండాలి, మల్టీ డొమైన్ అయితే 25 ఎకరాల భూమి ఉండాలి, లైబ్రరీల కనీసం 40వేల పుస్తకాలు ఉండాలి 80 వేల పుస్తకాల వాల్యూమ్స్ ఉండాలి నెక్స్ట్ 3ఇయర్స్ లో 50 లక్షల రూపాయలు లైబ్రరీ మీద ఖర్చు పెట్టాలి. ఎక్కువ మంది స్టాఫ్ ఉండాలని” వారు తెలిపారు.

ఒక్క సబ్జెక్టుకి మెయిన్ ప్రొఫెసర్ ఇద్దరు ఉండాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరిద్దరూ ఉండాలి మొత్తం 6 మంది ఉండాలి,లాబరేటరీ ఉండాలి.యూనివర్సిటీకి సరిపడా గ్రౌండ్ వుండాలి కానీ యూనివర్సిటీ కి ఉండవలసిన ఏ నిబంధనలు కూడా పాటించడం లేదు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా బయటికి తీయడం లేదు కమిటీ రిపోర్టుని ఎందుకు బయటకు తీస్తలేరు..? అని ఏబీవీపీ నాయకులూ ప్రశ్నించారు.

ప్రతి ఒక్క బస్సు మీద యూనివర్సిటీ అని రాసి ఉంది ఎందుకు యుజిసి దీనిమీద రెస్పాండ్ అవ్వడం లేదు. దీనిని బట్టి యూజీసీ కూడా ఆయా యూనివర్సిటీతో కుమ్మక్క అయిందని స్పష్టం అవుతుంది అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చనువుతోనే యూనివర్సిటీలు అనుమతి లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్స్ తీసుకుంటూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ వేల మంది విద్యార్థుల జీవితాలను అదోగతీ పట్టిస్తున్నారు అని అన్నారు.

ఈ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషిస్తూ విద్యను వ్యాపారం చేయడమే ధ్యేయంగా ప్రవర్తిస్తున్న తీరును ఖండించారు.ఇదే క్రమంలో గవర్నర్ బిల్లును తిప్పి పంపడం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలని, విశ్వవిద్యాలయాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

తెలంగాణలో ఏండ్ల చరిత్రలు కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ , మహాత్మా గాంధీ యూనివర్సిటీ , హంగూఆర్భాటంతో ప్రకటించిన కోఠీ మహిళా యూనివర్సిటీ వీటి ఏటి కూడా గత ప్రభుత్వాలు కేటాయించిన కేటాయింపులు తప్ప వసతులు లేవు అధ్యాపకులు లేరు” అని చెప్పారు.

ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండటమేకాకుండా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞాన సృష్టి జరిగే అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

ప్రభుత్వం యూనివర్సిటీల పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రైవేటు యూనివర్సిటీల వైపు చూడటం బట్టి విద్యను వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న తీరు స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు.దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 7వ తేదీన గురునానక్ అండ్ శ్రీనిధి యూనివర్సిటీల వద్ద విద్యార్థులకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు బనాయించడం జరిగింది.”అని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏబీవీపీ వెనకడుగు వేయదని వారు పెట్టిన డిమాండ్స్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని ఆపదనిఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ, సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ లు హెచ్చరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీవీపీ డిమాండ్స్ ను ముందు ఉంచడం జరిగింది. అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలని,ప్రైవేటు యూనివర్సిటీ హోదాకై ఇన్స్పెక్షన్ చేసిన కమిటీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ హోదా కల్పించిన హైయ్యార్ ఎడ్యుకేషన్ అధికారులు పై చర్యలు తీసుకోవాలి”అని డిమాండ్ చేశారు.

కనీస నిబంధనలు పాటించని యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పెద్దలపైన చర్యలు తీసుకోవాలి,ఈ వ్యవహారానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నైతిక బాధ్యత వహించాలి, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న యూనివర్సిటీ యజమానుల పైన ,స్పందించని ప్రభుత్వ అధికారుల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.

దీనిపైన గవర్నర్ వెంటనే స్పందించి ఇన్స్పెక్షన్ కమిటీ పైన చర్యలు తీసుకోవాలని లేకాపోతే వారి డిమాండ్స్ అమలు చేసే వరకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఏబీవీపీ ఉద్యమాన్ని ఆపదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

యూనివర్సిటీ అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటు విద్యార్థి జీవితాలను రోడ్డుపాలు చేసిన గురునానక్ అండ్ శ్రీనిధి యూనివర్సిటీ ని రద్దు చేసి ఆయా చైర్మన్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ, సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ లతో పాటు శ్రీకాంత్ పాల్గొన్నారు.