Mon. Dec 23rd, 2024
Cyient Receives the Thales Supplier Performance Award 2020

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్‌ 23, 2020 ః  అంతర్జాతీయ ఇంజినీరింగ్‌,డిజిటల్‌ సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌ నేడు 2020 సప్లయర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డును థేల్స్‌ నుంచి అందుకున్నట్లు వెల్లడించింది.  డిసెంబర్‌ 15వ తేదీన  జరిగిన థేల్స్‌ వర్ట్యువల్‌ యాన్యువల్‌ సప్లయర్‌ సదస్సు వద్ద కంపెనీ ఈ అవార్డును గుణాత్మక డెలివరీ ప్రదర్శక కోసం అందుకుంది.ఈ గుర్తింపు గురించి రాజేంద్ర వెలగపూడి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో, సైయెంట్‌ డీల్‌ఎం మాట్లాడుతూ ‘‘ఈ అవార్డు అందుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. సైయెంట్‌ ,థేల్స్‌ నడుమ వ్యూహాత్మక బంధాన్ని  ఇది లోతుగాప్రశంసిస్తుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో మా తోడ్పాటును సైతం ఇది ప్రతిబింబిస్తుంది. థేల్స్‌తో మా సంబంధంను ఉన్నత శిఖరాఖాలకు తీసుకువెళ్లేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

Cyient Receives the Thales Supplier Performance Award 2020
Cyient Receives the Thales Supplier Performance Award 2020

ఈ సందర్భంగా రోక్‌ కార్మోనా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్రూప్‌ ాఫ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్‌, థేల్స్‌ మాట్లాడుతూ ‘‘డిజైన్‌ ఇంజినీరింగ్‌, తయారీ, గో–టు–ఇండియా కార్యక్రమాలతో పాటుగా  పలు కీలక కార్యక్రమాల పరంగా మాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా సైయెంట్‌ నిలుస్తుంది. విజయవంతమైన భాగస్వామ్యాలు ఖచ్చితంగా అత్యున్నత డెలివరీ ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయి,పనితీరు శ్రేష్టతకూ భరోసా అందిస్తాయి. ఈ సంక్షోభ సమయంలో ఈ గుర్తింపునందుకున్నందుకు సైయెంట్‌ బృందాన్ని అభినందిస్తున్నాము..’’ అని అన్నారు

error: Content is protected !!