Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 12,2023: SSE (2022-23) బోర్డ్ ఎగ్జామ్స్‌లో 100% ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యం ఎంతో గర్వపడుతోంది. తమ స్కూల్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంలో కృషిచేసిన టీచర్స్ ను డీపీఎస్ యాజమాన్యం ప్రశంసించింది.

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులైన ప్రణవ్ చౌరాసియా (596/600 – 99.3%)తో మొదటి స్థానంలో, సత్యార్థ్ శివకుమార్ అయ్యర్ (593/600-98.8%)తో ద్వితీయ స్థానంలో, గోటూరి షణ్ముఖ శ్రీహర్ష (592/600-98.7%)తో తృతీయ స్థానంలో, చంద్రిక శ్రీష్ నారాయణ్ (591/600-98.5%)తో నాలుగో స్థానంలో, హర్షవర్ధన్ రవిచందర్ (590/600-98.3%)తో ఐదవ స్థానంలో నిలిచారు.

పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ పల్లవి, సీఓఓ మల్కా యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ సునీతరావు, వైస్ ప్రిన్సిపాల్ సురేఖ నయని ,ఉపాధ్యాయుల దూరదృష్టి వల్లే ఈ సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించామని డీపీస్ యాజమాన్యం తెలిపింది.

డీపీఎస్ లోని 98 మంది విద్యార్థులు 95%అంతకంటే ఎక్కువ, 231 మంది విద్యార్థులు 90% ఆపైన మార్కులు సాధించారు. 445 మంది విద్యార్థులు 80% ఆపైన మార్కులు సాధించారు, 573 మంది 70% ఆపైన మార్కులు తెచ్చుకున్నారు.

మొత్తం 663 మంది విద్యార్థులు (100%) 60% ,అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, ఐటీలో 79 మంది విద్యార్థులు, హిందీలో అత్యధికంగా 99 మంది విద్యార్థులు సెంటమ్‌లు సాధించారు.

ఇవీ కూడా చదవండి..

పన్నెండో తరగతి బోర్డ్ రిజల్ట్స్ లో సత్తా చాటిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు..

DELHI PUBLIC SCHOOL NACHARAM makes it to the Top Once Again in class 10 Board Exams-2022-23

DELHI PUBLIC SCHOOL NACHARAM makes it to the Top Once Again in class12 Board Exams..!

ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్న ఎలోన్ మస్క్..ఇదే కారణం..

error: Content is protected !!