365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్15,2025: హాలీవుడ్‌ నేపథ్యంలోని థ్రిల్లర్‌ మూవీ “డిఫరెంట్” ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్‌పై ఎన్.ఎస్.వి.డి. శంకరరావు నిర్మించిన ఈ సినిమాకు డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వం వహించారు. జి.ఎన్. నాష్, అజీజ్ చీమరువ్, ప్రెట్టీ జో, సనా, రోబర్ట్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

Read this also…“DIFFERENT” Trailer Out Now – Hollywood Suspense Thriller Set for April 18 Worldwide Release!

ఇది కూడా చదవండి..నెహ్రూ జూ పార్క్‌లో టిక్కెట్ కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు : సందర్శకుల ఆగ్రహం..

సినిమాటోగ్రఫీ లియోన్ ఆర్. భాస్కర్ అందించగా, సంగీతాన్ని నిహాల్ స్వరపరిచారు. టాప్ టెక్నీషియన్లతో రూపొందిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మితమైందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా, ఆసక్తికరమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కథ, కథనంలో వినూత్నతతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉందని చిత్రబృందం తెలిపింది.

ఇది కూడా చదవండి…పార్క్ హయత్‌లో అగ్ని ప్రమాదం.. కారణమేమిటంటే..?

ఇది కూడా చదవండి..అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ రచ్చ.. 5 రోజుల్లో చేరువలో 200 కోట్ల కలెక్షన్స్..

తెలుగు నిర్మాత ఎన్.ఎస్.వి.డి. శంకరరావు నిర్మించిన హాలీవుడ్ మూవీగా “డిఫరెంట్” ప్రత్యేకతను సంతరించుకుంది. మంచి కంటెంట్‌తో నాణ్యమైన సినిమా అందించాలనే ఉద్దేశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18న ఎస్‌కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.