365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబర్ 2,2022: ఎవరైనా తిరుమల తిరుపతికి వెళ్ళివచ్చారంటే..? ముందుగా వాళ్లని అడిగేది స్వామివారి ప్రసాదం గురించే..అంతటి ప్రాధాన్యత ఉంటుంది మరి ఆ ప్రసాదానికి.. శ్రీనివాసుడికి ఎంత ప్రీతికరమో.. ఈ లడ్డూ సామాన్యులకు కూడా అంటే ఇష్టం. ఐతే అందరికీ తిరుపతి లడ్డూ గురించి తెలుసు కానీ స్వామివా రికి సమర్పించే లడ్డూల్లో ఎన్నిరకాలున్నాయో తెలుసా..? అసలు తిరుమల శ్రీనివాశుడి లడ్డూల్లో ఎన్నిరకాలున్నాయో అవేంటో..? ఇప్పుడు తెలుసుకుందాం..

ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీశ్రీనివాసుడిని దర్శించుకోవ డానికి ప్రపంచదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడి లడ్డూలంటే కేవలం తెలుగు ప్రజలకే కాదు విదేశీ భక్తులు కూడా ఎంతగానోఇష్టపడుతుం టారు. స్వామివారి లడ్డూకి ఉండే రుచితోపాటు, వాసన కూడా ఎంతో ఇంపుగా ఉంటుంది. అందుకే ఈ లడ్డూకు జియోగ్రఫికల్ లైసెన్సు లభించింది.

అంటే తిరుమల లడ్డూ తయారీ విధానం ఒక్క తిరుమలతిరుపతి దేవస్థానానికి మాత్రమే చెందుతుంది. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికోసం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. కళ్యాణోత్సవ లడ్డూ..కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ లడ్డూ సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది.

కళ్యాణోత్సవంలోను పాల్గొన్నవారికి మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తుల కు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో ఉన్న వగపడి లో అందిస్తారు.ఇప్పుడు కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు అమ్ముతున్నారు. సాధారణ లడ్డు.. వీటిని ప్రోక్తం లడ్డూ అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఇవి అందిస్తారు. ఈ లడ్డూలను, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు175 గ్రాములు ఉంటుంది.

ఆస్థాన లడ్డులు.. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి ప్రముఖులకు, ముఖ్యఅతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూలను విక్రయించ రు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది.