365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 2,2025: తెలుగు సినిమా ప్రేక్షకులకు నటనతో ఆకట్టుకున్న కోమలి ప్రసాద్, ప్రస్తుతం ‘శశివదనే’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె యాక్టింగ్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పి మళ్లీ డాక్టర్‌గా వృత్తి కొనసాగిస్తున్నారని కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు వేగంగా వ్యాప్తి చెందాయి.
దీనిపై కోమలి ప్రసాద్ తన సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందిస్తూ ఈ ప్రచారం మొత్తాన్ని ఖండించారు.
“అందరికీ నమస్కారం. నా ఇటీవల(upload చేసిన) ఫోటోని చూసి, నేను పూర్తిగా డాక్టర్‌గా మారిపోయానని, నటనను వదిలేశానని కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నారు. పెద్ద మీడియా సంస్థలూ ఈ రూమర్లను నిజమని నమ్మిస్తున్నాయి. అయితే, అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మేరకు నేను కాస్త క్లారిటీ ఇస్తున్నాను.
Read This also…“No Truth In It”: Komalee Prasad Denies Rumours About Quitting Acting
Read This also…JSW MG Motor India Reports 21% YoY Sales Growth in June 2025; Gears Up for Luxury Launches..
శివుని కృపతో నా నటన ప్రయాణం బాగానే సాగిపోతోంది. తప్పుదోవ చూపే సమాచారం వ్యాప్తి చెందకూడదని కోరుతున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ రంగంలోనే చివరి వరకు నా శ్రమ, ప్రతిభను పెట్టే ప్రయత్నం చేస్తాను,” అని కోమలి అన్నారు.

“నా అభిమానులు, శ్రేయోభిలాషులు నాపై పెట్టుకున్న విశ్వాసం నాకు పెద్ద బలం. నేను జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నాను. త్వరలోనే మంచి ప్రకటనలతో మీ ముందుకు వస్తాను. నన్ను ఇలా ఆదరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు,” అని కూడా పేర్కొన్నారు.
తాజాగా కోమలి ప్రసాద్ ‘HIT: The Third Case’ చిత్రంలో కనిపించగా, ‘శశివదనే’తో మళ్లీ ప్రేమకథా చిత్రంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.