365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,2024: భక్తులు ఒక రూపాయి నుంచి ఒక లక్ష రూపాయల వరకు విరాళాలు ఇవ్వడానికి సులభతరం చేసేందుకు తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు (సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్‌లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ కియోస్క్ మిషన్ల ద్వారా 50 రోజులలోగా టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.55 లక్షల విరాళం చేరింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులోని శ్రీవారి ఆలయాల్లో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాలలో కియోస్క్ మిషన్ల ద్వారా 15 రోజుల్లో రూ.5 లక్షల విరాళం అందింది.

ఈ రోజు పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో ఈ కియోస్క్ మిషన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాలలో కూడా కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇవ్వడం సాధ్యం. త్వరలో, టీటీడీ అన్ని సేవలకు నగదు రహిత చెల్లింపుల సౌకర్యం అందించేందుకు ఈ మిషన్లను ఉపయోగించనుంది.