Sat. May 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే5, 2024: ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గతంలో చంద్రబాబు ఉద్యోగులను చిన్నచూపు చూడటం..వాళ్లకు జీతాలేందుకు అని అవహేళన చేయడం ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయి.

దీంతోపాటు సీమ్ వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తమకు లాభసాటి అని ఉద్యోగులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే.

మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు.

దీంతోపాటు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదు..రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా ఒక మూలకు రాదు..

అలాంటపుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని భయపడిన ఉద్యోగులు జగన్ మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారు.. ఈమేరకు ఇప్పటికే భారీగా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పోలైనట్లు తెలుస్తోంది.

Aslo read: You may eliminate tension and grief in this way.

ఇది కూడా చదవండి: దుఃఖాన్ని, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు ఇలా..

ఇది కూడా చదవండి: ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పాలిట విలన్ చంద్రబాబు..