365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 7,2025: లెర్నింగ్,అసెస్‌మెంట్ మార్కెట్‌కు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న అంతర్జాతీయ వర్టికల్ SaaS కంపెనీ ఎక్సెల్‌సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Excelsoft Technologies Limited) రూ. 700 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది.
ఈ ఐపీవోలో భాగంగా, కంపెనీ కొత్తగా రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు అయిన పెడాంటా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్,ధనంజయ సుధన్వ రూ. 490 కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నారు.
Read this also… Excelsoft Technologies Files DRHP with SEBI for Rs.700 Crore IPO..
Read this also… Asian Granito India Ltd Unveils a 3,500 sq ft Luxurious Display Center in Hyderabad
కంపెనీ ఈ ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను మైసూరులో కొత్త భవనం నిర్మాణం, స్థల కొనుగోలు, ప్రస్తుత కేంద్ర అప్‌గ్రేడేషన్, ఐటీ మౌలిక సదుపాయాల (సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్ సర్వీసెస్) అభివృద్ధి, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.

మైసూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎక్సెల్‌సాఫ్ట్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా లెర్నింగ్, అసెస్‌మెంట్ సేవలను అందిస్తూ, 17 దేశాల్లో 71 క్లయింట్లకు సేవలందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 198.3 కోట్ల ఆదాయాన్ని, రూ. 12.75 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఈ వ్యాపార విభాగంలో ఇలాంటి వ్యాపార నమూనా కలిగిన భారతీయ లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం విశేషం. ఈ ఐపీవోకి ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజరుగా వ్యవహరిస్తోంది.
Read this also… Women Investors Embrace Mutual Funds: Key Insights from PhonePe Wealth
ఇది కూడా చదవండి…జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్న కె.నాగబాబు..
అంతర్జాతీయ SaaS మార్కెట్లో వర్టికల్ SaaS విభాగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, 2030 నాటికి దీని మార్కెట్ వాటా 50% చేరుతుందని అరిజ్టన్ రిపోర్ట్ అంచనా వేస్తోంది.