Fri. Nov 8th, 2024


365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్14, 2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.

error: Content is protected !!