365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 26,2024: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు.నూతన ఉద్యోగ భాద్యతలను కూడా ఎప్పటి లాగానే విజయవంతంగా కొనసాగించాలని వారు కోరారు.
ఈ సందర్భంగా సిబ్బంది తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో HMDA పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకం తో అప్పగించిన బాధ్యత ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం కావాలన్నారు.