Tue. Apr 30th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 27,2022: ఒమిక్రాన్ ఇప్పటివరకూ ఒమిక్రాన్ సోకినవారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శుభవార్త అందించింది. ఒమిక్రాన్ కారణంగా శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతున్నట్లు ఐసీఎమ్ఆర్ గుర్తించింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఎటువంటి మార్పులు వచ్చాయనేదానిపై ఐసీఎమ్ఆర్ అధ్యయనం చేయగా డెల్టా వేరియంట్ తో సహా ఇతర హానికర ఇన్ఫెక్షన్లను అడ్డుకునే రోగనిరోధక శక్తి ఉత్పన్నమైనట్లు తేలింది.

ఇటీవల 39మంది వ్యక్తులపై ఐసీఎమ్ఆర్ రీసెర్చ్ చేసింది. వీరిలో 25మంది రెండు డోసులు తీసుకున్నవారు ఉండగా, 8మంది ఫైజర్ టీకా తీసుకోగా, మరో ఆరుగురు అసలు ఇప్పటివరకు టీకానే తీసుకోలేదు. మొత్తం మీద ఈ అధ్యయనంలో ఒమైక్రాన్ సోకిన వారిలో గణనీయమైన ఇమ్మ్యూనిటీ కనిపించినట్లు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. ఈ ఇమ్మ్యూనిటీ ఎటువంటి రీ-ఇన్ఫెక్షన్లనైనా ఎదుర్కోగలదని తేల్చింది.

అంతేకాదు ఒమిక్రాన్‌తోపాటు, ఇతర న్యూ వేరియెంట్స్ ను సైతం తుదముట్టించగలిగే నాలుగు రకాల యాంటీబాడీస్‌ని సైంటిస్టులు కనుగొన్నారు. తాము చేసిన ఈ పరిశోధన కేవలం ఒమిక్రాన్‌కు మాత్రమే కాదు.. భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ ను సైతం ఎదుర్కోవడానికి, దానికితగ్గట్టుగా వ్యాక్సిన్‌ తయారుచేయడానికి ఎంతో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ స్పైక్‌ ప్రొటీన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌కు అత్యధికంగా, అసాధారణంగా 37 మ్యుటేషన్స్‌ ఉన్నాయి. ఈ వేరియంట్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి, గతంలో ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వారికి కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌ ఇంత త్వరగా వ్యాప్తి చెందడానికి గల కారణాన్ని మేం చేసిన పరిశోధన కొంతవరకు దోహదపడుతుంది’ అని అన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మొత్తం మీద ఈ పరిశోధన వల్ల ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్‌ను పరిశోధకులు గుర్తించారు. అలాగే ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ముందస్తుగా.. టీకా మూడో డోస్‌ కూడా తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.