Wed. May 1st, 2024
Harish Rao review meeting with ministers
Harish Rao review meeting with ministers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్ ,జూన్ 14,2021: రాబోయే సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. 2022 వ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగును భారీ స్థాయిలో చేపట్టుటకు ఇప్పటి నుండే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుకూలమైన ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కోరారు, ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంలో మొక్కల లభ్యతే ప్రధాన అంశమని మంత్రి పేర్కొన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్సి, చైర్మన్, రైతు సమన్వయ సమితి, రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి, సురేందర్, ఎండి, టిఎస్ ఆయిల్‌ఫెడ్, వెంకట్ రామి రెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్, వై.కృష్ణరావు, సిజిఎం ,NABARD, సంతానం, డిజిఎం, NABARD, మురళీధర్, ఎండి, TSCOB తదితరులు పాల్గొన్నారు.

 Oil palm cultivation should be taken up on a large scale in the state: Minister T. Harish Rao
Harish Rao review meeting with ministers

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో కలసి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంపు పై చర్చించారు.