Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, భారతదేశం, మే15, 2024: ఫౌండేషన్ భారతదేశంలో అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ హెచ్ సీఎల్ టెక్ , కార్పొరేట్ సామాజిక బాధ్యతా ఏజెండాని ప్రోత్సహించే హెచ్సీఎల్ఎఫ్ తమ సంభావ్యతను ప్రదర్శించడానికి ఎన్జీఓల కోసం ఒక ప్లాట్ ఫాంను కేటాయించడానికి హెచ్ సీఎల్ టెక్ గ్రాంట్ ఇండియా 10వ ఎడిషన్ ను విడుదల చేసింది. సమాజాల్లో సుస్థిరమైన మార్పును కలగచేసింది.

గౌరవనీయమైన జ్యూరీ ఎంపిక చేసిన తొమ్మిది ఎన్జీఓలకు హెచ్ సీఎల్ టెక్ గ్రాంట్ ఇండియా 10వ ఎడిషన్ 16.5 కోట్లు (~$2.2 మిలియన్)నిధులు కేటాయించింది. వాతావరణం, ఆరోగ్యం,చదువు వంటి ఇతివృత్తాలలో సుస్థిరమైన గ్రామీణాభివృద్ధిలో మార్గదర్శక ప్రాజెక్ట్స్ కు గ్రాంట్ కేటాయించనుంది. hclfoundation.org/hcltech-grant పై దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ జూన్ 25, 2024.

“అట్టడుగు సంస్థలను మద్దతు చేయడానికి, భారతదేశంవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు కలగచేయడానికి వారికి సాధికారత కల్పించడంలో మా నిబద్ధతను హెచ్సీఎల్ టెక్ గ్రాంట్ సూచిస్తుంది. భారతదేశంవ్యాప్తంగా ఎన్జీఓల ద్వారా వినూత్నమైన ప్రాజెక్ట్స్ ను సమీక్షించడానికి ఎదురుచూస్తున్నాము. హెచ్ సీఎల టెక్ గ్రాంట్ ద్వారా ప్రభావవంతమైన చొరవలను మద్దతు చేస్తున్నామని,” నిధి పంధీర్, వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ సీఎస్ఆర్, హెచ్ సీఎల్ టెక్ & డైరెక్టర్, హెచ్ సీఎల్ ఫౌండేషన్ పేర్కొన్నారు.

హెచ్సీఎల్ టెక్ గ్రాంట్ ద్వారా హెచ్ సీఎల్ ఫౌండేషన్ ఇప్పటి వరకు, 146.95 కోట్లకు (~$18 మిలియన్) కట్టుబడింది. గ్రాంట్ 9వ ఎడిషన్ లో, ద కార్బెట్ ఫౌండేషన్ (గుజరాత్ లోని ఒక జిల్లాలో 16 గ్రామాలను కవర్ చేసింది), సంఘట్ (మధ్యప్రదేశ్ లో మూడు జిల్లాల్లో 4,060 గ్రామాలను కవర్ చేసింది) మక్కాల జాగృతి (కర్ణాటకలో ఒక జిల్లాలో 451 గ్రామాలను కవర్ చేసింది) ఒక్కొక్క సంస్థ వరుసగా వాతావరణం, ఆరోగ్యం,విద్యలో తమ ప్రాజెక్ట్స్ నాలుగేళ్ల వ్యవధి కోసం 5 కోట్లు (సుమారు $609,000) తమ ప్రాజెక్ట్స్ కోసం అందుకున్నాయి.

ప్రతి ఏడాది, హెచ్ సీఎల్ ఫౌండేషన్ ద ఫిఫ్త్ ఎస్టేట్-ద హెచ్ సీఎల్ టెక్ గ్రాంట్ కాంపెండియమ్ ను ప్రచురిస్తుంది. ఇది 30 ఎంపిక చేసిన ఎన్జీఓల , సమగ్రమైన, ఫోటో-డాక్యుమెంటెడ్ అంచనా, వాతావరణం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఉత్తమమైన ఆచరణలను ప్రధానాంశంగా సూచిస్తుంది. గ్రహీత ఎన్జీఓల ఎంపిక దరఖాస్తులు ప్రతిపాదనలు సమీక్షించడం, క్షేత్ర ఆడిట్స్ ,తగిన శ్రద్ధతో ప్రమేయమున్న విస్తృతమైన ఏడు-స్టెప్స్ పరీక్షా ప్రక్రియ ద్వారా జరిగింది.

Also read : HCLTech Grant India 10th edition launched; NGOs invited to apply

Also read : Canon develops EOS R1 as the first flagship model for EOS R SYSTEM

ఇది కూడా చదవండి: గోల్డ్ ఇటిఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న ఇన్వెస్టర్లు

ఇది కూడా చదవండి: 10,12వతరగతి ఫలితాల్లో డీపీఎస్ విద్యార్థుల హవా..

error: Content is protected !!