365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, మార్చి 8, 2025: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారత ఆర్మీ ,కామన్ సర్వీస్ సెంటర్ (CSC) అకాడమీ సంయుక్తంగా ప్రాజెక్ట్ NAMAN – ఎ ట్రిబ్యూట్ టు వెటరన్స్ ను 26 డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వెటరన్స్ (DIAV) ప్రాంతాలకు విస్తరించేందుకు అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించాయి.

ఈ ప్రాజెక్ట్ ఆర్మీ వెటరన్స్, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సేవలు,మద్దతు అందించేందుకు రూపొందించనుంది.

కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) విశ్రాంత ఆర్మీ సైనికులు లేదా వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులచే నిర్వహించబడతాయి. ఇవి పింఛను సేవలు, ప్రభుత్వం నుంచి పౌరులకు (G2C) సేవలు, వ్యాపార సేవలు (B2C) వంటి సేవలను రక్షణ సంస్థల పరిధిలోనే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేశాయి.

త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU) పునరుద్ధరణ

ఈ అవగాహన ఒప్పందాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (పరివర్తన్ కార్యక్రమం), ఇండియన్ ఆర్మీ DIAV, CSC అకాడమీ పునరుద్ధరించాయి.

Read this also…HDFC Bank, Indian Army & CSC Academy Expand Project NAMAN to 26 New Locations to Support Army Veterans

ఇది కూడా చదవండి…మహిళా దినోత్సవం సందర్భంగా మెగా మదర్ అంజనమ్మతో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సంతోషకరమైన అనుభూతులు!

Read this also… “Amma is the Magic That Holds Us Together and the Reason Behind Our Strong Family Bond” – Megastar Chiranjeevi

ఈ ఒప్పందంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ – సత్యేన్ మోడీ, CSC అకాడమీ సీఈఓ ప్రవీణ్ చందేకర్, ఇండియన్ ఆర్మీ వెటరన్స్ డైరెక్టరేట్ బ్రిగేడియర్, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ స్మితా భగత్, CSC అకాడమీ చైర్మన్ సంజయ్ రాకేష్, లెఫ్టినెంట్ జనరల్ (డిజి డిసి & డబ్ల్యూ) – ఇండియన్ ఆర్మీ, ఇతర ఆర్మీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ అధికారులు సమక్షంలో సంతకం చేశారు.

ప్రాజెక్ట్ విస్తరణ – రెండో దశ

ప్రాజెక్ట్ మొదటి దశ సెప్టెంబర్ 2023లో ప్రారంభమై 14 DIAV ప్రాంతాల్లో CSC కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండవ దశలో, ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, మేఘాలయ, బీహార్, ఒడిశా,న్యూఢిల్లీ కలిపి 26 DIAV ప్రాంతాలకు విస్తరించనుంది.

Read this also… international Women’s Day 2025: Boundless Achievements of Women

Read this also… Birla Opus Paints Unveils Its First-Ever Paint Studio, Redefining the Painting Experience

ఆర్థిక సహకారం,శిక్షణ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన పరివర్తన్ కార్యక్రమం కింద రక్షణ సేవ విరమణ పొందిన సైనికులు, వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు మద్దతుగా ఉంది.

ఈ కొత్త CSC కేంద్రాలు పింఛను సేవలతో పాటు ఆర్థిక సేవలు, ఉత్పత్తులపై శిక్షణ ,నైపుణ్య అభివృద్ధి అందిస్తాయి. సెంటర్ నిర్వహణలో ఉన్న వ్యక్తులకు ప్రారంభ 12 నెలల పాటు నెలవారీ గ్రాంట్ అందించనున్నారు.

ప్రాజెక్ట్ NAMAN ద్వారా భారత ఆర్మీ వెటరన్లకు గౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి సహాయపడుతుంది.