Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి5, 2024: గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్‌ యువతలో ఈ సమస్య మరింత అధికంగా కనిపిస్తుంది. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించే దాని ప్రకారం, ఇతర దేశాల కంటే భారతదేశంలో చాలా చిన్న వయస్సులోనే (దాదాపు 33% ముందు) గుండె జబ్బులు గుర్తించబడుతున్నాయి.

ఎలాంటి హెచ్చరిక లేకుండా ఈ సంఘటనలు బయట పడుతుండటం తరచుగా కనిపిస్తుంది. ఈ సమస్యకు కొన్ని ప్రధాన కారణాలలో నిశ్చల జీవన శైలి, అధిక శ్రమతో కూడిన పనిలో నిమగ్నమవ్వడం, అధిక స్థాయి ఒత్తిడి, సుదీర్ఘమైన డెస్క్ పని గంటలు వంటివి కనిపిస్తున్నాయి.

యువతలో ఈ తరహా గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి, ఊబకాయం కారణంగా రక్త నాళాలలో కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోవడం. తాజా లాన్సెట్ నివేదిక కూడా తెలంగాణలో 25% పైగా సెంట్రల్ ఒబేసిటీ , హైపర్‌టెన్షన్ కేసులు ఉన్నాయని పేర్కొంది. హైపర్ ట్రైగ్లిజరిడెమియా (రక్తంలో అధిక స్థాయిలో ట్రైగ్లిజరైడ్స్/కొవ్వు నిల్వలు) ఉండటం తెలంగాణలోని రోగులలో ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్.కె.జైన్ దీని గురించి మరింత వివరంగా మాట్లాడుతూ , “అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా మధుమేహం వంటి ప్రమాద కారకాలు లేకపోయినా స్థూలకాయం నేరుగా గుండెకు హాని కలిగిస్తుందని చెప్పారు.

చురుకైన చర్యలను చేపట్టడం చాలా ముఖ్యం, ముఖ్యంగా యువతలో ! వీరు శారీరకంగా కష్ట పడకపోవటం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటుండటం వల్ల సమస్యల బారిన పడుతున్నారు” అని అన్నారు.

ఊబకాయం ఉన్న వ్యక్తులకు వారి శరీరానికి తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేయడానికి ఎక్కువ రక్త సరఫరా అవసరమవుతుంది, దీని వలన రక్తపోటు పెరుగుతుంది. దీనికి తోడు, ఊబకాయం వల్ల ధమనులలో కొవ్వు పదార్ధం పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) గుండె కండరాలలో కనిపించే అధిక ట్రోపోనిన్ స్థాయిలతో బలంగా ముడిపడి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఊబకాయం కలిగి వుండి , అధిక ట్రోపోనిన్ స్థాయిలను కలిగి ఉన్న వ్యక్తులు గుండె ఆగిపోయే అవకాశం, సాధారణ బరువు గుర్తించలేని ట్రోపోనిన్ ఉన్నవారి కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందని అవి సూచిస్తున్నాయి.

రోగులు పరిగణించవలసిన చికిత్సా విధానాలపై డాక్టర్ జైన్ మాట్లాడుతూ , “ఈ రోగులకు గుండె ఆరోగ్యం,బరువు నిర్వహణ రెండింటినీ నిర్వహించటానికి తగిన సంరక్షణ అవసరం. చికిత్సా ఎంపికలలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడానికి మందులు ఇవ్వడం, పూడుకుపోయిన ధమనులను తెరవటానికి యాంజియోప్లాస్టీ వంటి విధానాలు లేదా సరైన ఫలితాల కోసం బైపాస్ సర్జరీని పరిగణించడం వంటివి ఉండవచ్చు.

ముఖ్యంగా, కార్డియాక్ కేర్ ఇప్పుడు మెటల్ లెస్ యాంజియోప్లాస్టీ టెక్నిక్‌ల ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచింది. ఇది మరింతగా చికిత్సా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ వినూత్న విధానం మెటాలిక్ స్టెంట్‌లతో మెటల్ లోడ్‌ను తగ్గించడంపై దృష్టి సారిస్తుంది.

బయో రిసోబబుల్ స్కాఫోల్డ్‌ల (BRS) వినియోగాన్ని ఏకీకృతం చేస్తుంది, సాధారణ భాషలో చెప్పాలంటే డిసాల్వింగ్ స్టెంట్‌లు, డ్రగ్-కోటెడ్ బెలూన్స్ (DCB) ఇది ధమనులకు ఔషదాలను పంపిణి చేసి మళ్లీ కుచించుకు పోకుండా ఆపడం తో పాటుగా ఎలాంటి శాశ్వత ఇంప్లాంట్స్ లేకుండా చేస్తాయి.

ఈ విధానం కార్డియాక్ చికిత్స లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది, రోగులకు వారి శరీరంలో ఇతర పదార్థాల దీర్ఘకాలిక ఉనికిని తగ్గిస్తూనే , ధమనుల పనితీరు ను మరింత మెరుగ్గా తిరిగి పొందే అవకాశాన్ని అందిస్తుంది” అని అన్నారు.

ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువును నిర్వహించడం, జీవనశైలిలో మార్పులు చేయడం, అవసరమైనప్పుడు అవసరమైన వైద్యపరమైన సహాయాన్ని పొందడం, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడం, హృదయ సంబంధ సమస్యలు, సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం చాలా అవసరం” అని ఆయన అన్నారు.