365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్24, 2021: జీహెచ్ఎంసీ పరిధిలోని మౌలిక సదుపాయల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే మౌలిక వసతులు ఉండాలన్నారు. దానికి అనుగుణంగా ఏడు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరంలో తాగునీటికి సమస్య లేకుండా చేశామన్న మంత్రి.. తాగునీటి సమస్య 90 శాతం పూర్తయ్యిందన్నారు. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా సమస్యల్లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమలతో పాటు అన్ని వర్గాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా పేరొందిందని గుర్తుచేశారు.
- ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 1650 ఎంఎల్‌డీ సీవరేజి ఉత్పత్తి అవుతోంది.
- ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 25 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 772 ఎంఎల్‌డీ.
- ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.78 శాతం ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
- మరో 878 ఎంఎల్‌డీ మురుగు ట్రీట్‌మెంట్ జరగాల్సి ఉంది.
- హైదరాబాద్ నగరంలో సీవరేజ్ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం ప్రభుత్వం ముంబైకు చెందిన షా టెక్నికల్ కన్సెల్టెంట్‌ను నియమించింది.
- ప్రస్తుతం(2021) నగరంలో 1950 ఎంఎల్‌డీ(1650 ఎంఎల్‌డీ జీహెచ్ఎంసీలో, 300 ఎంఎల్‌డీ ఓఆర్ఆర్ పరిధిలో) మురుగు ఉత్పత్తి అవుతోంది. 2036లో 2,814 ఎంఎల్‌డీ, 2051లో 3,715 ఎంఎల్‌డీ మురుగు ఉత్పత్తి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది.
- మొత్తం 62 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని ఈ సంస్థ ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 31 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓఆర్ఆర్ పరిధిలో 31 నిర్మించాలని సూచించింది.
- జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్‌టీపీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. జీహెచ్