365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 23,2025: ఇంటర్నెట్ లేకపోయినా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపు చేయవచ్చు. యూపీఐ తమ వినియోగదారులకు USSD కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తుంది.
USSD కోడ్ ద్వారా, వినియోగదారులు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయడమే కాకుండా వారి యూపీఐ పిన్‌ను కూడా మార్చుకోవచ్చు అలాగే చెల్లింపు చేయవచ్చు. ఈ సౌకర్యం గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము.
అన్ని బ్యాంకులు ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపునకు మద్దతు ఇస్తాయి *99#
Read this also...A.R. Rahman’s ex-wife faces health issues after divorce, shares a post about her ex-husband following surgery.
ఇది కూడా చదవండి...విడాకుల తర్వాత అనారోగ్యానికి గురైన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య.. శస్త్రచికిత్స తర్వాత తన మాజీ భర్త కోసం పోస్ట్..
Read this also...Twists, Laughs & Drama – 5 Reasons to Watch Janaka Aithe Ganaka on Tata Play Telugu Cinema..!
ఆన్‌లైన్ చెల్లింపుల గురించి మాట్లాడుకుంటే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వేగవంతమైన విస్తరణలో యూపీఐ పాత్ర చాలా ముఖ్యమైనది.
నేడు, నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది డిజిటల్ పే మెంట్స్ పై ఆధారపడి, నగదు చెల్లింపులు దాదాపుగా మానేశారు.

నెట్‌వర్క్ స్లోగా ఉండడం కారణంగా కొన్నిసార్లు యూపీఐ ద్వారా చెల్లింపు చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు యూపీఐ చెల్లింపును ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు ఎలా చేయాలి అంటే..?
స్టెప్ 1 : ముందుగా మీరు మీ మొబైల్ నుండి *99# డయల్ చేయాలి.
స్టెప్ 2: దీని తర్వాత మీరు మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
స్టెప్ 3: మెను నుంచి మీరు సెండ్ మనీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: చెల్లింపు చేయడానికి, మీరు స్టెప్ ఐడీ , మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
Read this also...NxtWave Joins TIER IV & NSDC to Build Largest AV Developer Community
Read this also…Supreme Court Directs States to Provide Privacy and Protection for Mothers to Breastfeed Their Babies
Read this also…Trump Announces Plan to Cut 6,000 IRS Jobs
స్టెప్ 5: ఇప్పుడు మీరు రిసీవర్ వివరాలు, మొత్తాన్ని నమోదు చేయాలి.
స్టెప్ 6: మీ యూపీఐ పిన్‌ను నమోదు చేసి చెల్లింపును నిర్ధారించండి.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు ప్రయోజనాలు..
మీరు ఈ విధంగా ఇంటర్నెట్ లేకుండా మారుమూల ప్రాంతాలలో సులభంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.

యూపీఐ చెల్లింపును చిన్న ఫోన్ (కీప్యాడ్ మొబైల్) ద్వారా చేయవచ్చు.
బ్యాంక్ సర్వర్లు 24×7 పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో, లావాదేవీలు ఎప్పుడైనా చేయవచ్చు.
మీరు ఎటువంటి యాప్ లేకుండా సురక్షితంగా, సులభమైన మార్గంలో చెల్లింపులు చేయవచ్చు.
ఈ సౌకర్యం ఏ యే బ్యాంకుల్లో అందుబాటులో ఉంది అంటే..?
భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపును *99# కి మద్దతు ఇస్తున్నాయి. వీటిలో SBI, HDFC, ICICI, Axis, PNB అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రధాన బ్యాంకులు ఉన్నాయి.
ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి..
యూపీఐ చెల్లింపులు చేస్తున్నప్పుడు మీ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.
ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం, అధికారిక USSD కోడ్ *99# మాత్రమే ఉపయోగించండి.
మీ మొబైల్ నంబర్ బ్యాంకుతో లింక్ చేసిందై ఉండాలి.

ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులకు ఎంత పరిమితి..?
ప్రస్తుతం, మీరు ఆఫ్‌లైన్ యూపీఐ ద్వారా రూ. 5000 వరకు చెల్లింపు చేయవచ్చు. ఆఫ్‌లైన్ లావాదేవీలతో పాటు, మీరు పిన్‌ను కూడా మార్చవచ్చు. USSD కోడ్ ద్వారా చెల్లింపును స్వీకరించమని అభ్యర్థించవచ్చు.