365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే13, 2023: ఈ రోజుల్లో ఈ సమస్య గురించి తెలియని స్త్రీలు వుండరు. సుమారుగా 75%స్త్రీలు ఈ సమస్య తో బాధ పడుతున్నారు.
@లక్షణాలు..
-మానసిక ఆందోళన, ఒత్తిడి, విచారం.
-కారణం లేకుండానే ఏడ్వడం,ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలుంటాయి.
-రోజువారీ పనుల్లో అయిష్టత, పనిపై ధ్యాస నిలుపకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.-కడుపులో గ్యాస్ చేరటం, శరీరంలో వాపు, బరువు పెరగటం, పార్శ్యపు తలనొప్పి, రొమ్ముల్లో వాపు, నొప్పి, అరుదుగా నడుంనొప్పి వంటివి వస్తాయి.
-బలహీనంగా అనిపించటం, ఆకలి తగ్గటం, నిద్రపట్టకపోవటం, తీపి, ఉప్పు కలిగిన ఆహారపదార్ధాలను తినాలనే కోరిక,దాంపత్య కోరికలు తగ్గటం వంటి లక్షణాలుంటాయి.
-కొన్ని సమయాల్లో వాంతులు అవుతాయి.అప్పుడప్పుడు విరేచనాలవుతాయి.
-ఇలాంటి లక్షణాలన్నీ పీరియడ్ రావడానికి వారం రోజుల ముందు నుంచి మొదలవుతాయి.పీరియడ్ రాగానే కొంత మందిలో తగ్గిపోతాయి కొంతమందిలో రుతుస్రావం ఆగే వరకూ వుంటాయి.
@చికిత్స..
అశ్వగంధ చూర్ణం, అతి మధుర చూర్ణం, ఆకుపత్రి చూర్ణం సమానంగా కలుపుకుని ఒక స్పూన్ చొప్పున రెండుసార్లు సేవిస్తే మానసిక వికారాలను నివారిస్తాయి. ముండీ స్వరసంలో మిరియాల చూర్ణం కలిపి వేడిచేసి భోజనానికి ముందు సేవిస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. నరాల బలహీనత శమిస్తుంది.