Sat. Jun 15th, 2024

మిలియన్లకు పైగావ్యూస్.. రికార్డులు బద్దలు కొట్టిన జగన్ ఇంటర్వ్యూలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ ,మే 9,2024: సీఎం వైయస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ – 9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది… దాంతోబాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది.. అందులో అభివృద్ధి, సంక్షేమం.. వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.

ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ – 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి.. టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు… సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి…తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.


దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది.. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు…రెండో సారి చేస్తే గ్రహపాటు…. మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి.

దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి.

ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది… ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు..లక్షల్లో షేర్లు… లైక్స్… కామెంట్స్ తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది.

ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది…మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు. ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి.


అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఎబిఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ వేలల్లో కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఈమేజ్.వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఈమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.

జగన్ కోసం సిద్ధం ప్రచారం ఆరవ రోజులో YSRCP ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ఊపందుకుంది. 66 లక్షల మంది ప్రజలు YSRCP స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు. రాబోయే రాజకీయ పోటీ కోసం జగన్‌కు తమ మద్దతు ఇస్తున్నారు.

శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇళ్లను సందర్శించి, ఆంధ్రప్రదేశ్ కోసం నవరత్నాలు ప్లస్ అనే సీఎం జగన్ దార్శనిక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో అగ్రగామిగా ఉన్నాయి.

ఈరోజు తెల్లవారుజామున వైఎస్‌ఆర్‌సిపికి లభించిన మద్దతు కారణంగా వైఎస్‌ఆర్‌సిపి మహిళా నాయకులపై టిడిపి దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఏదేమైనా, ఈ దాడులు పార్టీ దృష్టికి మద్దతు ఇవ్వడానికి ప్రతిరోజూ వచ్చే లక్షలాది మంది సంకల్పాన్ని మాత్రమే బలోపేతం చేశాయి. మహిళా కేడర్ సీఎం జగన్‌పై ఆశలు పెట్టుకుని, ఎంతకైనా తెగించి ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాజకీయ పోరులో సిఎం జగన్‌తో భుజం భుజం కలిపి నిలబడే తమ ప్రయత్నాలను ఎండ లేదా వాన అడ్డుకోలేవని అంకితభావంతో ఉన్న కేడర్, స్టార్ క్యాంపెయినర్లు అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఈరోజు కోనసీమ జిల్లాలోని మండపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం జగన్ హామీలు ప్రతి ఇంటికీ చేరేలా నాయకులు ప్రజలతో మమేకమయ్యారు.

Also read : Alembic Pharmaceuticals Profit up by 78% to Rs. 632 Crores for FY24

ఇది కూడా చదవండి: అక్షయ తృతీయరోజు పూజలు, షాపింగ్ చేయడానికి ముహూర్తం..