365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సికింద్రాబాద్, జనవరి 4,2025: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 13 తేదీ నుంచి 15వతేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న అంతర్జాతీయ గాలిపటాలు, మిఠాయిల మహోత్సవం- 2026 ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్–2026 ఘనంగా నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన గాలిపటాల నిపుణులు, వివిధ రాష్ట్రాల సంప్రదాయ స్వీట్లు ఈ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇదీ చదవండి : రా అండ్ రూటెడ్ మూవీ ‘దిల్ దియా’ టైటిల్ లాంచ్..!

ఇదీ చదవండి :2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆరోగ్య సందేహాలివే..!

ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి కాంతి, ట్రాఫిక్ డీసీపీ దన్నరపు శ్రీనివాస్, లా అండ్ ఆర్డర్ అడ్డిషనల్ డీసీపీ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ కమిషనర్ జీహెచ్‌ఎంసీ సుజాత, ఫైర్ సర్వీసెస్, పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో జరుగబోయే మహోత్సవం సందర్భంగా భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక సదుపాయాలు, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులకు సంబంధిత ఆదేశాలు జారీ చేశారు.

Read this also: Telugu Horror-Mystery ‘Not All Movies Are The Same: Dual’ Set for Multi-Language Premiere on Lionsgate Play..

Read this also:Santoor Emerges as India’s Leading Soap Brand with Rs.2,850 Crore in Sales..

మహోత్సవం విజయవంతం అయ్యే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వెల్లడి చేశారు.ఈ వేడుకలో దేశీయ, అంతర్జాతీయ స్థాయి కైట్ ఆర్టిస్ట్స్, మిఠాయిల వ్యాపారులు పాల్గొననున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026 ఉండనుంది.