365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద్రాబాద్, ఫిబ్రవరి 5,2025: హైద్రాబాద్ లో వివిధ ర‌హ‌దారుల‌పై అడ్డుగా నిర్మించిన ప్ర‌హ‌రీలను హైడ్రా బుధ‌వారం తొల‌గించింది. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీలో, కాల‌నీవాళ్ల అభ్యంత‌రాల‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.

ఎన్ ఆర్ ఐ కాల‌నీ వారు నిర్మించిన ప్ర‌హ‌రీలను తొల‌గించి, రాక‌పోక‌ల‌కు సుల‌భ మార్గం ఏర్పాటు చేసింది. ఈ చర్యతో, 4 కాల‌నీలకు రాక‌పోక‌లు సుల‌భంగా జరిగేందుకు వీలు కల్పించింది.

This Also Read: MG Sewa Drives Social Transformation, Empowering Over 70,000 Women and Girls Among 1.2 Lakh Beneficiaries in 2024

ఇది కూడా చదవండి:చెరువుల్లో మట్టి నింపుతున్నవారిపై హైడ్రా నిఘా – అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

వీటిలో సీనియ‌ర్ సిటిజ‌న్ కాల‌నీ, శాంతి విల్లాస్‌, లక్ష్మి విల్లాస్‌, గౌరీనాథ్ పురం, వంపుగూడ కాల‌నీలకు మార్గం ఏర్పడింది.

ప్ర‌జ‌లు తెలిపారు, “ముందు ద‌మ్మాయిగూడ పోయే ప్ర‌ధాన ర‌హ‌దారిక చేరాలంటే 3 కిలోమీట‌ర్లు ప్రయాణించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు కేవ‌లం 100 మీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది” అని.

కాప్రా మున్సిపాలిటీ అధికారులు, “ర‌హ‌దారుల‌కు అడ్డుగా నిర్మించిన ప్ర‌హ‌రీలను తొల‌గించిన వెంట‌నే రోడ్డులు వేస్తామ‌ని హామీ ఇచ్చారు” అని స్థానికులు పేర్కొన్నారు.

ఇది కాకుండా, శంషాబాద్ మండ‌లం రాళ్ల‌గూడ వ‌ద్ద కూడా ఔట‌ర్ రింగురోడ్డుకు చేరేందుకు అడ్డుగా నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది.

This Also Read:Axis Bank Reaffirms Commitment to Supporting Cancer Research and Care in India

ఇది కూడా చదవండి: మహాకుంభ్‌లో ప్రధాని మోదీ విశిష్ట తీరు: రుద్రాక్ష మాల, గోచీ వస్త్రాలతో ప్రత్యేక ఆకర్షణ

1200 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా
మ‌ల్కాజిగిరి స‌ర్కిల్ ప‌రిధిలోని డిఫెన్స్ కాల‌నీలో, స‌ర్వే నంబ‌రు 218\1లో ప్ర‌జావ‌స‌రాల కోసం ఉద్దేశించిన స్థ‌లం క‌బ్జా అయిందంటూ స్థానికులు హైడ్రాకు పిర్యాదు చేశారు.

స్థానిక అధికారులు, హైడ్రాతో కలిసి విచారించి, 1200 గ‌జాల స్థ‌లాన్ని అసోసియేష‌న్ పెద్ద‌లు ప్లాట్లుగా చేసి విక్ర‌యించిన‌ట్టు నిర్ధారించారు. ఈ క‌బ్జాలను తొల‌గించి, ప్ర‌జావ‌స‌రాల కోసం ఉద్దేశించిన స్థ‌లంగా గుర్తించి, హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.