365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సంగారెడ్డి, సెప్టెంబర్ 1,2024: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం సనాగరెడ్డి జిల్లా అమీన్‌పూర్, పటాన్‌చెరు మండలాల్లోని పలు చెరువులను సందర్శించారు.
ఈ చెరువుల ఆక్రమణలపై ఆయనకు పలుమార్లు ఫిర్యాదులు అందడంతో ఈ చెరువుల్లోని ఆక్రమణలను గుర్తించాలని నీటిపారుదల శాఖ అధికారులను రంగనాథ్ కోరారు.
పటాన్‌చెరు బస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న సాకి చెరువులో ఏ మేరకు ఆక్రమణలు జరిగాయని ఆరా తీశారు.