365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 17,2025:  ఐసీఐసీఐ బ్యాంక్, హైదరాబాద్‌ నానక్‌రామ్‌గుడాలోని మైస్కేప్ రోడ్ (Myscape Road)లో తమ కొత్త శాఖను ప్రారంభించింది. బ్యాంక్‌కి ఇది నగరంలో 260వ బ్రాంచీ. ఇందులో ఏటీఎం కూడా ఉంది.

PnP కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ Mr. P.V.R. రాజేంద్ర ప్రసాద్ ఈ శాఖను ప్రారంభించారు.

ఇందులో సేవింగ్స్ , కరెంట్ అకౌంట్స్ (GIFT సిటీ అకౌంట్లు సహా), డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు, ఫిక్సిడ్,రికరింగ్ డిపాజిట్లు, అలాగే గృహ రుణాలు, ప్రాపర్టీపై రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు, పసిడి రుణాలు, విద్యా రుణాలు, కార్డ్ సర్వీసులతో పాటు ఫారెక్స్ సర్వీసులు సహా అకౌంట్లు, డిపాజిట్లకు సంబంధించి సమగ్ర సేవలు లభిస్తాయి.

ప్రైవేట్ బ్యాంకింగ్, ఫ్యామిలీ ఆఫీస్ సొల్యూషన్స్‌తో పాటు ఎన్నారై కస్టమర్లకు బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ని కూడా ఈ శాఖ అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు వ్యక్తిగతీకరించిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక డెస్క్‌తో పాటు వీల్‌చెయిర్ సదుపాయం కూడా ఈ శాఖలో ఉంది. ఇందులో రెండు లాకర్ రూమ్స్ ఉన్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు, అలాగే మొదటి, మూడో, అయిదో శనివారాల్లో ఈ శాఖ ఉదయం 9.30 గం.ల నుంచి సాయంత్రం 3.00 గం.లవరకు పని చేస్తుంది.

కస్టమర్ల ఇంటి వద్దే ట్యాబ్లెట్ డివైజ్ ద్వారా బ్యాంకు ఉద్యోగి దాదాపు 100 సర్వీసులను ఈ బ్రాంచ్, ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా అందిస్తుంది. ఖాతాలు,ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) తెరవడం, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ చేయడం, ఈ-స్టేట్‌మెంట్స్ జనరేట్ చేయడం, చిరునామా మార్పు మొదలైన సర్వీసులను ఈ శాఖ అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌నకు తెలంగాణలో 370 పైగా శాఖలు, 630 పైచిలుకు ఏటీఎంలు మరియు క్యాష్ రీసైక్లింగ్ మెషిన్లు (సీఆర్ఎంలు) ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ బహుళ డెలివరీ శాఖల నెట్‌వర్క్, ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (www.icici.bank.in), మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్లకు సేవలు అందిస్తోంది.