365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 24,2024: ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ‘స్మార్ట్‌లాక్’ అనే విశిష్టమైన భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో ఫోన్ లేదా ఈ-మెయిల్ చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి సహాయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా, కస్టమర్లే స్వయంగా వివిధ బ్యాంకింగ్ సర్వీసులను అప్పటికప్పుడు లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఐమొబైల్ పేలో అందుబాటులో ఉండే ఈ ఫీచరులో, ఒక్క బటన్ క్లిక్ చేయడం ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (బ్యాంకు అకౌంటుకు అనుసంధానించిన ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులు సహా), క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు యాక్సెస్‌ను కస్టమర్లు తామే స్వయంగా లాక్/అన్‌లాక్ చేయొచ్చు.
తద్వారా తమ అకౌంటు భద్రతను తామే పర్యవేక్షించుకోవచ్చు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఈ తరహా ఫీచర్లలో ‘స్మార్ట్‌లాక్’ మొదటిది. దీనితో కస్టమర్లు మొత్తం ‘ఐమొబైల్ పే’ ని కూడా లాక్/అన్‌లాక్ చేయొచ్చు.
కస్టమర్లు నిర్దిష్ట సమయం పాటు ఏదైనా బ్యాంకింగ్ సర్వీసును డీయాక్టివేట్ చేసేందుకు దీన్ని వాడుకోవచ్చు. ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నా ఈ ఫీచరును ఉపయోగించుకోవచ్చు. బ్యాంకింగ్ సర్వీసును లాక్ చేసినప్పటికీ నిర్దేశిత స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ (ఎస్ఐ), ఈ-మ్యాండేట్లు యథాప్రకారం అమలయ్యేందుకు అనుమతించడమనేది ‘స్మార్ట్‌లాక్’ ఫీచరు ప్రత్యేకత.

“కస్టమర్ల బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడమనేది మాకు అత్యంత ప్రాధాన్యతాంశం. కస్టమర్ల ఖాతాలను సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకు ఈ ‘స్మార్ట్‌లాక్’ను ప్రవేశపెట్టింది.
ఈ డూ-ఇట్-యువర్‌సెల్ఫ్ (DIY) ఫీచరుతో, ఒకే చోటు నుంచి బ్యాంకింగ్ సర్వీసులను మరింత సురక్షితంగా మార్చుకునే వెసులుబాటు నేరుగా కస్టమర్ల చేతికే లభిస్తుంది. బ్యాంక్ చేపట్టే వివిధ రకాల ‘సేఫ్ బ్యాంకింగ్’ కార్యక్రమాల్లో ఇది కూడా భాగం.”
అని ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ శ్రీ సిద్ధార్థ మిశ్రా తెలిపారు.
‘స్మార్ట్‌లాక్’ ఫీచర్‌ను ఉపయోగించేందుకు దశలు:
· ఐమొబైల్ పే లో లాగిన్ కావాలి

· హోమ్ స్క్రీన్‌కి కుడివైపు దిగువన ‘స్మార్ట్‌లాక్’ ఫీచర్‌పై క్లిక్ చేయాలి
· మీరు లాక్/అన్‌లాక్ చేయదల్చుకున్న కీలక బ్యాంకింగ్ సర్వీసులపై క్లిక్ చేయాలి
· కన్ఫర్మ్ చేసేందుకు స్వైప్ చేయాలి
‘ఐమొబైల్ పే’పై మరింత సమాచారం పొందేందుకు, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌ను సందర్శించగలరు.
ఇతర బ్యాంకుల కస్టమర్లు ‘ఐమొబైల్ పే’ని ఉపయోగించేందుకు తమ బ్యాంకు ఖాతాను యాప్‌తో అనుసంధానించి, యూపీఐ ఐడీని జనరేట్ చేసుకుని, లావాదేవీలు జరపవచ్చు.

న్యూస్, అప్‌డేట్స్ కోసం www.icicibank.com ను సందర్శించండి .ట్విటర్‌లో www.twitter.com/ICICIBank ను ఫాలో అవ్వండి.
Also read :ICICI Bank introduces ‘SmartLock’, a unique safety measure on iMobile Pay
Also read :Birla Opus’s Interactive Expo Reaches Hyderabad