Tue. Sep 17th, 2024
Medicover Hospitals, save India’s youngest Covid-19+ve patient using ‘Plasma Therapy’

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,ఆగస్టు 17, 2020: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి తదేకంగా దృష్టి సారిస్తూ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా భారత దేశం చరిత్రాత్మక స్థాయిలో 3 కోట్ల పరీక్షల స్థాయి దాటింది. పరీక్షలు జరిపే లాబ్ ల నెట్ వర్క్ ను దేశమంతటా విస్తృతం చేయటం వలన ఈ కార్యక్రమాలకు ఊతమిచ్చినట్టయింది. గడిచిన 24 గంటల్లో 7,31,697  పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరిపే సామర్థ్యాన్ని రోజుకు 10 లక్షలకు చేరుకోవటం ద్వారా ఎక్కువ పరీక్షలకు వెసులుబాటు కలిగింది. దీంతో ప్రతి పది లక్షలమందిలో పరీక్షలు జరిపిన వారి సంఖ్య పెరిగి నేడు రీజుకు 21,769 స్థాయికి చేరింది. 2020 జులై 14 నాటికి మొత్తం పరీక్షల సంఖ్య 1.2 కోట్లకు చేరగా ఆగస్టు 16 నాటికి 3.0 కోట్లకు చేరింది. మరోవైపు పాజిటివ్ కేసుల శాతం ఈ సమయంలో  7.5% నుంచి 8.81%  కి పెరుగుతూ వచ్చింది. నిజానికి పరీక్షల సంఖ్య ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండటం వల్ల పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ తగ్గించటానికి ఢిల్లీ అనుభవమే ఒక ఉదాహరణే. సకాలంలో ఐసొలేషన్ చేయటం, ఆనవాలు పట్టి గుర్తించటం, తగిన చికిత్స అందించటం లాంటి మిగిలిన చర్యలన్నీ సక్రమంగా తీసుకుంటే  ఇది సాధ్యమేనని తేలింది.దూకుడుగా పరీక్షలు జరపటం వలన త్వరగా గుర్తించి పాజిటివ్ కేసులను  ఐసొలేషన్ లో ఉంచటానికి వీలు కలిగింది. దీంతోబాటు సమర్థంగా చికిత్స అందించటం వలన మరణాల సంఖ్యను తగ్గించటం సాధ్యమైంది. అందువలన పరీక్షల దూకుడు పెంచినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్యను, మరణాల శాతాన్ని అదుపు చేయటం వీలైంది.


పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. 2020 జనవరిలో పూణెలో ఒకే ఒక లాబ్ ఉండగా ఇప్పుడు 1470 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 969 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 501 ఉన్నాయి. రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి: 
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  754 (ప్రభుత్వ:  450  + ప్రైవేట్:  304)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 599 (ప్రభుత్వ: 485+ ప్రైవేట్: 114)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117 (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 83 )కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/   @MoHFW_INDIA ను సందర్శించండి. కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19@gov.in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019@gov.in  @CovidIndiaSeva ను సంప్రదించవచ్చుకోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

error: Content is protected !!