Fri. Jul 5th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,ఏప్రిల్ 29,2024: ఇండిజీన్ లిమిటెడ్ ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సోమవారం 2024 మే 6న ప్రారంభమై బుధవారం 2024 మే 8న ముగుస్తుంది.

యాంకర్ బిడ్డింగ్ తేదీ దానికి ఒక రోజు ముందు శుక్రవారం 2024 మే 3న ఉంటుంది. ఐపీవోకి సంబంధించి షేరు ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 430 – రూ. 452గా ఉంటుంది. కనీసం 33 ఈక్విటీ షేర్లకు, ఆ తర్వాత 33 గుణిజాల్లో షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన ఉద్యోగులకు రూ. 12.5 కోట్ల వరకు విలువ చేసే షేర్లు ఆఫర్ చేయనున్నాయి. ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్ కింద బిడ్ చేసే అర్హత కలిగిన ఉద్యోగులకు ఒక్కో షేరుపై 30 శాతం డిస్కౌంటు లభిస్తుంది.

తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులు తమ మెటీరియల్ సబ్సిడరీల్లో ఒకటైన ఐఎల్ఎస్ఎల్ హోల్డింగ్స్‌కి సంబంధించిన రుణాల రీపేమెంట్/ప్రీపేమంట్ కోసం, కంపెనీతో పాటు మెటీరియల్ సబ్సిడరీల్లో ఒకటైన ఇండిజీన్‌కి సంబంధించి ఇతరత్రా మూలధన వ్యయాల కోసం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాలు, ఇనార్గనిక్ వృద్ధి అవసరాల కోసం వినియోగించుకోబడతాయి.

ఆఫర్ కింద తాజాగా రూ. 760 కోట్ల వరకు విలువ చేసే ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా ఆఫర్ ఫర్ సేల్ కింద 2,39,32,732 ఈక్విటీ షేర్లు విక్రయించబడనున్నాయి. ఇందులో మనీష్ గుప్తా 11,18,596 షేర్ల వరకు, రాజేశ్ భాస్కరన్ నాయర్ 32,33,818 వరకు, అనితా నాయర్ 11,51,454 వరకు (“వ్యక్తిగత సెల్లింగ్ షేర్‌హోల్డర్లు”) షేర్లను విక్రయించనున్నారు.

అలాగే, గ్రూప్ లైఫ్ స్ప్రింగ్ భాగస్వామి హోదాలో విడా ట్రస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫిగ్ ట్రీ ట్రస్ట్) 36,00,000 వరకు షేర్లను, బీపీసీ జెనిసిస్ ఫండ్ I ఎస్‌పీవీ లిమిటెడ్ 26,57,687 వరకు, బీపీసీ జెనిసెస్ ఫండ్ I-A ఎస్‌పీవీ 13,78,527 వరకు, సీఏ డాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ 1,07,92,650 ఈక్విటీ షేర్ల వరకు (అన్నీ కలిసి విడా ట్రస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, బీపీసీ జెనిసిస్ ఫండ్ I ఎస్‌పీవీ, బీపీసీ జెనిసిస్ ఫండ్ I-A ఎస్‌పీవీగా వ్యవహరించాయి) విక్రయించనున్నాయి.

ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలో లిస్ట్ చేయబడతాయి. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) సంస్థలు ఈ ఆఫర్‌కు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

Also read: INDEGENE LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON MONDAY, MAY 6, 2024

Also read: Waaree Energies Limited secures 400 MW Solar Module Supply Contract from GIPCL

ఇది కూడా చదవండి:  Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..

ఇది కూడా చదవండి: హైదరాబాద్-బెంగళూరు రూట్‌లో 10 శాతం తగ్గింపును ప్రకటించిన TSRTC..