Tue. Dec 10th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఏప్రిల్ 29,2024: నూతన యుగపు డిజైన్ ఎక్సలెన్స్‌ను వేడుక చేసుకుంటూ, ఈ రంగంలో వర్ధమాన ప్రతిభావంతులకు తమ పనితనాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన వేదికను అందజేస్తూ వోక్స్‌సెన్ యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరపు మొదటి డిజైన్ షో ‘డిజైన్ వాన్‌గార్డ్ 2024’ను ఈరోజు హైదరాబాద్‌లోని టి-వర్క్స్‌లో నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో క్లైమేట్ చేంజ్, మెడ్‌టెక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, క్రాఫ్ట్ ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్ డిజైన్, మెంటల్ వెల్‌నెస్ హెరిటేజ్ కన్జర్వేషన్ వంటి సామాజిక సంబంధిత ముఖ్యమైన అంశాలపై ఇరవై వినూత్న ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో డిజైన్ ఆవిష్కరణ ద్వారా మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతను ఇది ప్రదర్శించింది.

ఈ కార్యక్రమం వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులైన విద్యార్థుల అత్యుత్తమ నైపుణ్యం ను ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు దర్శకుడు అడివి శేష్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్- డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, భారత ప్రభుత్వం (హైదరాబాద్); సేల్స్‌ఫోర్స్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ సీనియర్ డైరెక్టర్ , మైక్రోసాఫ్ట్‌ మాజీ UX డైరెక్టర్ పరాగ్ త్రివేది; ఒప్పో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ – తస్లీమ్ ఆరిఫ్ ; Xelpmoc డిజైన్ & టెక్ లిమిటెడ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కొల్లిపర – , (మికా) జావో, బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో లెక్చరర్, తదితతరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం గురించి ప్రముఖ నటుడు దర్శకుడు,కార్యక్రమ ముఖ్య అతిథి అయిన అడివి శేష్ మాట్లాడుతూ, “నాకు 18 లేదా 19 సంవత్సరాల వయస్సులో ఇలాంటివి అందుబాటులో ఉంటే బాగుండేది. డిజైన్ వాన్‌గార్డ్ అందంగా ఉంది. వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయం ఇక్కడి విద్యార్థులతో అద్భుతమైన రీతిలో పని చేస్తోంది.

ఇక్కడ ప్రదర్శించిన అన్ని విద్యార్థి ప్రాజెక్ట్‌లు నాకు బాగా నచ్చాయి, ప్రత్యేకించి ఒక విద్యార్థి కొండపల్లి బొమ్మలను ఉపయోగించి సినిమా తీసిన చిత్రం నాకు బాగా నచ్చింది. డిజైన్ చేయడానికి అవకాశం ఇస్తే, నేను ఇక్కడ విద్యార్థిగా చేరడానికి ఇష్టపడతాను… ” అని అన్నారు.

డిజైన్ రంగంలో విద్యార్థి-ఆధారిత కార్యక్రమాల నొక్కిచెబుతూ, డిజైన్ విద్యార్థులచే నడపబడే, J.Qork , ఈ ఈవెంట్‌లో అరంగేట్రం చేసింది. ఇక్కడ ఐదు అద్భుతమైన ఉత్పత్తులు ఆవిష్కరించాయి. ప్రత్యేక ప్రెజెంటేషన్‌గా, ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు J.Qork ఉత్పత్తులతో ఒక ఫాషన్ వాక్ చేశారు , ప్రత్యేక క్రియేషన్‌ల వెనుక ఉన్న నైపుణ్యం స్ఫూర్తిని ప్రదర్శించారు.

తన ఆలోచనలను పంచుకున్న, డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & డిజైన్ వోక్సేన్ యూనివర్శిటీ డాక్టర్ ఆదితి సక్సేనా మాట్లాడుతూ , “పరిశ్రమ మారుతున్న అవసరాలను, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను గుర్తించి, అసాధారణమైన ప్రతిభావంతులైన డిజైన్ విద్యార్థులు తమ ఉత్తమ పనిని, వినూత్న భావనలు ప్రదర్శించడానికి వేదికను సృష్టించడం చాలా కీలకం.

సానుకూల సామాజిక మార్పును తీసుకురావడానికి డిజైన్, పరివర్తన శక్తిని ఉపయోగించడం చాలా అవసరం. ఈ దిశగా మా ప్రయత్నాన్ని డిజైన్ వాన్‌గార్డ్ సూచిస్తుంది-ఇది వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైన డిజైన్ ప్రయత్నాలను హైలైట్ చేయడమే కాకుండా వివిధ పరిశ్రమల విభిన్న డిమాండ్‌లతో ప్రతిభను అనుసంధానించే వేదికగా కూడా పనిచేస్తుంది… “అని అన్నారు.

ఇది కూడా చదవండి: ఇండిజీన్ లిమిటెడ్ ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ 2024 మే 6న ప్రారంభం…

Also read: INDEGENE LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON MONDAY, MAY 6, 2024

Also read: Waaree Energies Limited secures 400 MW Solar Module Supply Contract from GIPCL

ఇది కూడా చదవండి:  Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..

ఇది కూడా చదవండి: హైదరాబాద్-బెంగళూరు రూట్‌లో 10 శాతం తగ్గింపును ప్రకటించిన TSRTC..

error: Content is protected !!