365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జులై 10,2020: ఇన్‌స్టాగ్రామ్ నేడు నూతన వీడియో ఫార్మాట్ రీల్స్ పరీక్షను ఇండియాలో మరింతగా విస్తరించినట్లు వెల్లడించింది. భారతదేశంలోని హైదరాబాద్ నుంచి ఈ ఫార్మాట్‌లో పోస్ట్ చేసిన వ్యక్తులలో తొలి వరుసలో జాహ్నవి దాశెట్టి (మహాతల్లి) సమంత అక్కినేని నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌పై నూతన మార్గంలో లఘు వీడియోలను సృష్టించి పంచుకునే అవకాశాన్ని రీల్ అందించడంతో పాటుగా ఈ వేదికపై వినోదం భవిష్యత్నుపునర్నిర్వచించ నుంది . అంతర్జాతీయంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌పై ఉండటంతో పాటుగా తమను తాము వ్యక్తీకరించుకునేందుకు ఈ వేదికను విభిన్నమైన మార్గాలైనటువంటి ఫీడ్, స్టోరీస్, ఐజీటీవీ,లైవ్ ద్వారా ఉపయోగించుకుంటున్నారు. రీల్స్‌తో , ప్రజలు ఇతరులకు వినోదం కలిగిస్తూనే తమను తాము వ్యక్తీకరించుకోవచ్చు. అది వినోదాత్మక నూతన నృత్యం చేయడం ద్వారా లేదా తమ మనసుకు నచ్చిన కార్యక్రమానికి సంబంధించిన సందేశాన్ని వ్యాప్తి చేయడం అయినా కావొచ్చు. ప్రజలు 15 సెకన్ల మల్టీ వీడియో క్లిప్స్‌ను రికార్డు చేయడంతో పాటుగా ఆడియో, ఎఫెక్ట్స్ ద్వారా ఎడిట్ చేయడం, రీల్స్‌పై నూతన సృజనాత్మక ఉపకరణాలను ఉపయోగించి మార్చడంతో పాటుగా ఫీడ్‌పై తమ అనుసరణీయులతో పంచుకోవడం ఒకవేళ వారికి పబ్లిక్ ఖాతా ఉంటే, ఎక్స్‌ప్లోర్‌లో నూతన ప్రాంగణం ద్వారా విస్తృతస్థాయి ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీకి వాటిని అందుబాటులో ఉంచవచ్చు. ఎక్స్‌ప్లోర్‌లో రీల్స్‌ను పంచుకోవడమంటే, వారు అక్కడ కనిపించవచ్చు ,విస్తృతస్థాయిలో ప్రేక్షకులకు కనిపించవచ్చు, మరీముఖ్యంగా అంతర్జాతీయంగా ప్రతి నెలా ఇన్‌స్టాగ్రామ్‌పై 50%కు పైగా ఎక్కౌంట్స్ ఎక్స్‌ప్లోర్‌ను సందర్శిస్తుంటాయి. ఎక్స్‌ప్లోర్‌లోని రీల్స్, ఇన్‌స్టాగ్రామ్‌పై పబ్లిక్ ఎక్కౌంట్స్ చేసిన వినోదాత్మక రీల్స్‌ను ప్రదర్శిస్తాయి. ఇవి ప్రజలను తమ తదుపరి రీల్స్‌ను చేసేందుకు ప్రేరేపిస్తాయి.అజిత్ మోహన్, వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఫేస్‌బుక్ ఇండియా మాట్లాడుతూ ‘‘మా ఫేస్‌బుక్ ఇండియా వ్యూహంలో అత్యంత కీలకమైన మూలస్థంభాలలో ఒకటి దేశం కోసం వ్యక్తీకరణను తెలుసుకోవడం. దేశవ్యాప్తంగా వీడియో వినియోగం పెరగడం మరియు భారతదేశంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై మూడవ వంతు పోస్ట్‌లు వీడియోలే కావడంతో ఇన్‌స్టాగ్రామ్ అత్యంత కీలక పాత్రను పోషించాల్సి ఉంది. భారతదేశంలో చిన్న, పెద్ద నగరాలలోని ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌పైకి రావడంతో పాటుగా తమను తాము సురక్షితంగా వ్యక్తీకరిస్తున్నారు,వినోదాన్ని పంచుతున్నారు. ప్రజలు సంక్షిప్త రూపంలో కంటెంట్‌ను సృష్టించే సామర్థ్యంను నూతన వీడియో ఎడిటింగ్ టూల్స్ తో కల్పించడంతో పాటుగా అంతర్జాతీయ వేదికపై క్రియేటర్స్‌గా నిలిచే అవకాశం ప్రజలకు రీల్స్ అందిస్తుంది.
మహాతల్లిగా గుర్తింపు పొందిన జాహ్నవి దాశెట్టి, రీల్స్‌ను తొలిగా ఉపయోగించిన వినియోగదారులలో ఒకరుగా నిలిచారు. ఆమె తన అనుభవాలను పంచుకుంటూ ‘‘ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను హైదరాబాద్‌లో ప్రయత్నించిన తొలి కొద్ది మందిలో ఉండటం పట్ల సంతోషంగా ఉంది. నేనెప్పుడూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌పై ఎక్కువ మొత్తంలో కంటెంట్‌ను పంచుకుంటుంటాను,ఇప్పుడు మరింతగా తెలుగు వినోదాత్మక కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌పై పంచుకోగలననిపిస్తుంది. ఇది వినోదాత్మకంగా ఉంది!’’ అని అన్నారు.ఈ ఫీచర్‌ను భారతదేశంలో ఈ వారం మొదట్లో ప్రారంభించారు. ఇప్పటికే సుప్రసిద్ధ వ్యక్తులు మరియు కంటెంట్ క్రియేటర్లు అయినటువంటి సమంత అక్కినేని, హన్సికా మొత్వానీ, జాహ్నవి దాశెట్టి (మహాతల్లి), నిఖిల్ విజయేంద్ర సింహ, లావణ్య టీ, గీతా మాధురి, ప్రగ్యా జైశ్వాల్, ప్రణీత సుభాష్ వంటి వారు ఉపయోగించారు.ఇది ప్రయోగాత్మకమే అయినప్పటికీ, సరైన అనుభవాలను అందించేందుకు,భారతదేశం రీల్స్‌ను సృష్టించి, పంచుకునేటప్పుడు నేర్చుకోవడం ,నిర్మించడాన్ని కొనసాగించడానికి ఇన్‌స్టాగ్రామ్ కట్టుబడి ఉంది. ఆవిష్కరణ నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా సృష్టించబడిన రీల్స్‌ను చూసేందుకు #FeelitReelit అనుసరించండి. రీల్‌ను సృష్టించేందుకు:ఇన్‌స్టాగ్రామ్ కెమెరా చివరన ఉండే రీల్స్ ఎంచుకోవాలి. మీ స్ర్కీన్ ఎడమ వైపున వైవిధ్యమైన ఎడిటింగ్ టూల్స్‌ను మీరు చూడవచ్చు. మీ రీల్‌ను సృష్టించేందుకు వాటిని మీరు వినియోగించవచ్చు. వీటిలో ఆడియో, ఏఆర్ ఎఫెక్ట్స్, టైమర్, కౌంట్‌డౌన్, ఎలైన్, స్పీడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.