365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 27,2025: జాతీయ విజిలెన్స్ అవగాహన వారోత్సవం 2025 సందర్భంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లోని పరిపాలన భవనంలో అక్టోబర్ 27, 2025 సోమవారం నాడు సమైక్యత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ. సిహెచ్. విద్యాసాగర్ ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా, విధి నిర్వహణలో నిజాయితీతో కూడిన సేవలను అందించడం, పారదర్శకతను పాటించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం,ప్రభుత్వ సహాయం కోసం వచ్చే వారి హక్కులను కాపాడుతూ, న్యాయ సూత్రాలకు అనుగుణంగా సేవలు అందించడానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బోధన,బోధనేతర సిబ్బంది, అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని సమైక్యత ప్రతిజ్ఞలో భాగమయ్యారు.