Sun. May 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, మచిలీపట్నం, అక్టోబర్ 20, 2021: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు, మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీకి గుడ్ బై చెప్పి వైయస్సార్సిపి పార్టీలో చేరుతున్నట్లు పొలాటితిప్ప గ్రామస్తులు పలువురు పేర్కొంటున్నారు. మంత్రి పేర్ని నాని కార్యాలయం వద్ద పార్టీలో చేరిన పలువురికి ఆయన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలో కొన‌సాగుతున్న జనరంజకమైన ప‌రిపాల‌న‌కు మెచ్చి ఎందరో ప్ర‌జ‌లు ఇటీవల స్వ‌చ్ఛందంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. ఒక మంచి నాయ‌కుడి పాల‌న‌లో కార్య‌క‌ర్త‌ల్లా ఉండ‌టాన్ని గ‌ర్వంగా భావిస్తున్నార‌న్నారు. పొలాటితిప్ప గ్రామస్తులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానికి ఎత్తుకొన్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మీ అందరిని ఒక కుటుంబ సభ్యుని మాదిరిగా వైస్సార్ సీపీ కుటుంబంలోకి ప్రేమగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తగిన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్న పోలాటితిప్ప వాసులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు.

స్థానికంగా వైస్సార్ సీపీకి నాయకత్వం వహిస్తున్న మోకా ప్రసాద్ నూతనంగా పార్టీలో చేరినవారిని స్నేహపూర్వక వాతావరణంలో కలుపుకొని సుదీర్ఘకాలం వారితో కలిసిమెలసి పని చేసేలా ప్రోత్సాహించాలని వారి ప్రతి కష్టంలో తోడుగా ఉండి ఏ ఇబ్బంది కలగకుండా కాపాడు కోవాలని నూతన సభ్యుల బాధ్యతలను మోకా ప్రసాద్ కు అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప గ్రామానికి చెందిన వనమాడి నాగరాజు, వనమాడి దుర్గారావు, వనమాడి ఏడుకొండలు, మోకా నాగరాజు, మోకా తాతయ్య, మోకా నాగబాబు, సున్నంపూడి నాగరాజు, వనమాడి రామాంజనేయులు, వనమాడి నాంచారయ్య, వనమాడి శ్రీను, సున్నంపూడి వాకలయ్య, వనమాడి రామాంజనేయులు, వనమాడి సురేష్, చింతా సురేష్, వనమాడి హనుమంతరావు, వనమాడి కేశవరావు, వనమాడి కృష్ణ, తదితరులు వైఎస్సార్‌ సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ జెడ్పిటీసి సభ్యులు లంకె వెంకటేశ్వరరావు (ఎల్వీయార్)పోలాటితిప్ప వైస్సార్సీపీ ఇంచార్జీ మోకా దుర్గారావు, మోకా ప్రసాద్, లంకె తాతయ్య తదితరులు పాల్గొన్నారు.