Wed. Nov 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 10,2024: డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) సభ్యులు వందలాదిమంది ఆదివారం ఫ్యూచర్ సిటీని (ఫోర్త్ సిటీ) సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తామని చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సందర్శన జరిగింది.

సభలో డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్శన సందర్భంగా డీజేహెచ్ఎస్ ప్రతినిధులు ఫోర్త్ సిటీ వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆరు నెలల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే అభ్యర్థనను బొల్లోజు రవి వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా ఫోర్త్ సిటీ ప్రాధాన్యతను వివరించారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్, రాబోయే స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణాల వల్ల అభివృద్ధి చెందనుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో మెట్రో రైలు మార్గం సౌకర్యం కూడా రానున్నందున ఇది శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతేకాకుండా, జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఉండాలని, ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!