365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 22, 2025: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ కెఎల్ఎం ఆక్సివా ఫిన్‌వెస్ట్ తన 25వ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న హోటల్ లెమన్ ట్రీ వేదికగా మార్చి 22న జరిగిన ఫార్చునా ‘25 ఉద్యోగుల సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 1000కుపైగా శాఖలతో విస్తరించిన కెఎల్ఎం ఆక్సివా ఫిన్‌వెస్ట్, తన వ్యాపార లక్ష్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ సినీ నటి, లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read this also…‘Rice Mill’ movie in theaters soon..!
Read this also…KLM Axiva Finvest Celebrates 25th Anniversary with “Fortuna 25” Employee Summit in Hyderabad
ఫార్చునా 25 సదస్సును మాజీ భారతీయ దౌత్యవేత్త, కెఎల్ఎం ఆక్సివా ఫిన్‌వెస్ట్ చైర్మన్ టి.పి. శ్రీనివాసన్ (ఐఎఫ్ఎస్, రిటైర్డ్) ప్రారంభించగా, సీఈఓ మనోజ్ రవి అధ్యక్షత వహించారు. ఉద్యోగులతో కలిసి సంస్థ 25 ఏళ్ల విజయయాత్రను సంబరంగా జరుపుకుంది.

ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ బుత్రా నాగేంద్ర, రీజనల్ హెడ్‌లు సంస్థ విజయ గాథను వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలను సీఈఓ మనోజ్ రవి వెల్లడించారు. 2025కు సంబంధించిన వ్యూహాత్మక రోడ్‌మ్యాప్, డిజిటల్ పరివర్తన, సంస్థ ఎదుగుదలపై ప్రాముఖ్యత నొక్కి చెప్పారు.
సదస్సులో భాగంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు సత్కారాలు అందజేసి, వారి అంకితభావాన్ని గుర్తించారు.
ఇది కూడా చదవండి…ఎక్కువ గంటలు పని చేయాలనే తన భర్త ప్రకటనపై స్పందించిన సుధా మూర్తి..
కెఎల్ఎం ఆక్సివా ఫిన్‌వెస్ట్ భవిష్యత్తులో మరింత విస్తరణకు నడుం బిగించింది. సంస్థ తన ఐపీఓ ప్రణాళికలను సిద్ధం చేస్తూ, 2030 రోడ్‌మ్యాప్‌ను డిసెంబర్ 2025లో ఆవిష్కరించనుంది. దీంతో సంస్థ వ్యాపార వృద్ధికి మరింత బలమైన బాట పడనుందని నిర్వాహకులు తెలిపారు.