Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 28,2023: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌‌లో తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ సందడిగా సాగుతోంది.

సబ్ జూనియర్స్‌ బాలికల విభాగంలో తొలి రోజు గురువారం జరిగిన మూడు రేసుల్లోనూ హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రసూల్‌పురా ఉద్భవ్ స్కూల్ కు చెందిన లాహిరి కొమరవెల్లి విజయం సాధించి నారీ శక్తిని చూపెట్టింది.

3 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న లాహిరికి గట్టి పోటీ ఇస్తున్న ఆమె సోదరి దీక్షిత (10 పాయింట్లు) రెండవ స్థానంలో నిలిచింది. బిందు రత్లావత్ (27 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. ఈ పోటీల్లో బాలురు, బాలికలు అందరూ ఒకే ఫ్లీట్ లో పోటీ పడుతున్నారు.

ఇక, బాలుర విభాగంలో వికారాబాద్‌కు చెందిన టాప్ సీడ్ బన్నీ బొంగూర్ (12 పాయింట్లు) కొంచెం ఫామ్‌లో కనిపించకపోయినా అగ్రస్థానంలో ఉన్నాడు.

పెద్దగా అంచనాలు లేని వినోద్ దుండూ (14 పాయింట్లు), సాథ్విక్ ధోకీ (24 పాయింట్లు) 2,3వ స్థానాల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ అండర్ 16 ఛాంపియన్‌షిప్‌ పోటీలో తేలికపాటి గాలులు కేవలం 31 కిలోల మాత్రమే ఉన్న లాహిరికి సాయం చేయగా.. 45 కిలోల బరువున్న ఆమె సోదరి దీక్షితకు చాలా ప్రతికూలంగా మారాయి.

తక్కువ బరువున్న సెయిలర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హాఫ్ రిగ్ సెయిల్స్ లను ఉపయోగించి జూనియర్‌‌ విభాగం సెయిలర్లు రేపు పోటీ పడనున్నారు.

3 రేసుల తర్వాత తుది పాయింట్లు
బాలికలు

  1. లాహిరి కొమరవెల్లి –3 పాయింట్లు
  2. దీక్షిత కొమరవెల్లి –10 పాయింట్లు
  3. బిందు రత్లావత్ –27 పాయింట్లు
    బాలురు
  4. బన్నీ బొంగుర్– 12 పాయింట్లు
  5. వినోద్ దుండూ– 14 పాయింట్లు
  6. సాథ్విక్ ధోకి –24 పాయింట్లు
error: Content is protected !!