Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 1,2023: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లోనూ నష్టపోయాయి. ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం కన్నా అమెరికా బాండ్ యీల్డుల పెరుగుదల ఇన్వెస్టర్లను ఆందోళన పెడుతోంది.

ఇదిలాగే పెరిగితే విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను మరింత వెనక్కి తీసుకొనే ప్రమాదం పొంచిఉంది. యూఎస్ ఫెడ్ హాకిష్ స్టాన్స్‌, రుణ ప్రణాళిక, జాబ్ డేటాపై ఆసక్తి నెలకొంది.

నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణి కనబరచగా ఐరోపా మార్కెట్లు నష్టపోయాయి. నిఫ్టీ 19,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 283 పాయింట్లు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.29 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 63,874 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 63,829 వద్ద మొదలైంది. ఆరంభంలోనే 63,896 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ క్రమంగా పతనమైంది. 63,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. చివరికి 283 పాయింట్ల నష్టంతో 63,591 పాయింట్లు నష్టపోయింది.

బుధవారం 19,064 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ19,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 18,973 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 90 పాయింట్లు పతనమై 18,989 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 145 పాయింట్లు ఎరుపెక్కి 42,700 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభపడగా 36 నష్టపోయాయి. సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కో, టాటా కన్జూమర్ షేర్లు టాప్ గెయినర్స్. అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్ టాప్ లాసర్స్.

రంగాల వారీగా పరిశీలిస్తే మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.

నిఫ్టీ నవంబర్‌ నెల ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,000 వద్ద సపోర్ట్‌, 19,130 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి బిర్లా సాఫ్ట్‌, రిలాక్సో, అజంతా ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కరూర్‌ వైశ్యా బ్యాంకు షేర్లను కొనొచ్చు.

నిఫ్టీ నష్టాల్లో ఇన్ఫోసిస్, ఎల్‌టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, ఏసియన్ బ్యాంకు కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. సన్ ఫార్మా, రిలయన్స్ లాభపడటం కాస్త నష్టాలను తగ్గించింది.

వొడాఫోన్ ఐడియా షేర్లు నేడు సంచలనం సృష్టించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 23 శాతం మేర ఎగిశాయి. ఏంజెల్ వన్, బిర్లా సాఫ్ట్, సీడీఎస్ఎల్, ఫ్యాక్ట్, పతంజలీ ఫుడ్స్, ట్రెండ్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. సన్ ఫార్మా నేడు క్యూ2 ఫలితాలు విడుదల చేసింది.

గతేడాది ఇదే సమయంలోని రూ.10,952 కోట్లతో పోలిస్తే ఆదాయం 11.3 శాతం పెరిగి రూ.12,192కు చేరుకుంది. లాభం 5 శాతం మేర ఎగిసింది. అజ్మేరా రియాల్టీ నిరాశపరిచింది. రెవెన్యూ 21.6 శాతం తగ్గి రూ.145 కోట్లుగా నమోదైంది. నికర లాభం 33.1 శాతం తగ్గింది.

జూబిలంట్ ఇంగ్రేవా ఆదాయం 21.8 శాతం తగ్గింది. గుజరాత్ అంబుజా రెవెన్యూ ఆదాయం 3.5 శాతం పెరిగి రూ.1116 కోట్లుగా ఉంది. ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐతో కో లెండింగ్ పాట్నర్‌షిప్ కుదుర్చుకుంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
    .