Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 19,2024: రాజశేఖర్ రెడ్డి సమయం లో అయితే కాంగ్రెస్ లేదా టిడిపి కి పట్టం కట్టే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ పుట్టుక తర్వాత ఫ్యాన్ గుర్తుకి పట్టం కడుతూ వచ్చారు.

ఇక 2019 లో జిల్లా మొత్తం పదికి పది వైసీపీ కి ఇచ్చేసారు..అయితే ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో దాదాపు కీలక రెడ్లు అంతా ఇప్పటికే వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు అటు టీడీపీ కో లేక వైసీపీ కో చీలుతోంది తప్పితే మరో పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి లేదు..రెడ్డి సామజికవర్గం తో పాటు.. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు కొన్ని నియోజకవర్గాల్లో బలం గానే ఉంది…

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం… ఇందులో ముందుగా సర్వేపల్లి నియోజకవర్గం లోనే వైసీపీ కి గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి..

సర్వేపల్లి సీనియర్ ఎమ్మెల్యే గా, మంత్రి గా కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గం లో మంచి పట్టున్నప్పటి కీ తన గెలుపుకి కష్ట పడి పని చేసిన అనుచరులకు కాకుండా మరికొంత మంది వైపే మంత్రి చల్లని చూపులు ఉండటం తో వ్యతిరేకత పెరుగూ వచ్చింది…

ఇలాంటి పరిస్థితుల్ని అందిపుచ్చు కోవాలి అనుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ. కాంగ్రెస్ డిఎన్ఏ తో పాటు యువ నాయకుల వైపు ఫోకస్ పెట్టినట్టు సమాచారం…

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు,నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇందులో ముందు వరుసలో ఉన్నాడు .10 ఏళ్ల నుంచి తన గ్రామం నిలబడ్డాడు కిరణ్ … ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా మండలం లోని స్కూల్ కోసం కోర్టుల్లో పెద్ద పోరాటమే చేసాడు.

అద్భుతమైన రోడ్లు, ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా స్కూల్ నిర్మాణం,ఇంటి నుంచి విద్యార్థుల్ని నేరుగా స్కూల్ కి తీసుకెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు ,గ్రామం లో నీటి కుళా యిలు.. ఇలా అనేక సేవా కార్యక్రమాలతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అక్కంపేట కి శ్రీమంతుడు అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి.

వైసీపీ కి బలంగా ఉన్న ఈయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబుతున్నట్టు సమాచారం… ఎమ్మెల్యే రేస్ లో కూడా ఉన్నట్టు నియోజవర్గం లో పెద్ద చర్చే జరుగుతోంది…

అయితే సర్వేపల్లి లోనే కాకాణి కిరణకుమార్ రెడ్డి ని రంగం లోకి దింపుతారా లేక వైసీపీ ఓట్లు చీల్చాల్సిన మరో కీలక నియోజకవర్గం లో ఏమైనా కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందా చూడాలి….

ముఖ్యం గా రెడ్డి,ముస్లిం మైనారిటీ, బీసీ లు అత్యధిక ప్రభావం చూపే చోట కాంగ్రెస్ పార్టీ…

కిరణ్ కుమార్ రెడ్డి లాంటి విద్యావంతుడైన మనసున్న మచ్చలేని ఇలాంటి యువ నాయకులను రంగం లోకి దింపితే అధికార పార్టీ ఓట్లు చీలడం ఖాయం గానే కనబడుతుంది… చూడాలి కాంగ్రెస్ ప్రయత్నాలు అటు వైసీపీ ఓట్లకు గండికోడుతుందా లేక టీడీపీ కి ఇబ్బంది గా మారుతుందా అనేది…