365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 4,2025: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం లభించడం ‘ఎం4ఎం’ (Motive for Murder) మూవీ హీరోయిన్ జో శర్మకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో భాగమవ్వడం గర్వంగా ఉందని, ముఖ్యంగా హాలీవుడ్ ప్రఖ్యాత పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం తనకు మరింత ప్రత్యేకమైన అనుభూతి కలిగించిందని జో శర్మ తెలిపారు.

Read this also...PM Modi Urges Industry Leaders to Take Bold Steps in Manufacturing

Read this also...Government Serves ₹24,500 Crore Demand Notice to Reliance Over ONGC Gas Dispute

Read this also…Jio Platforms Partners with AMD, Cisco, and Nokia to Launch Open Telecom AI Platform at MWC 2025

“ఈ రంగుల హరివిల్లు వలె కనిపించే ఈవెంట్‌ను ప్రత్యక్షంగా అనుభవించడం అద్భుతమైన అనుభూతి” అని జో శర్మ పేర్కొన్నారు.

అదేవిధంగా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఎం4ఎం’ (Motive for Murder) మూవీ త్వరలో విడుదల కానుందని వెల్లడించారు. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ హై ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read this also…Sai Ronak’s ‘Rewind’-A Time-Bending Sci-Fi Romance Premieres on Lionsgate Play on March 7

ఇది కూడా చదవండి…హోర్డింగుల తొలగింపునకు గడువు – అనుమతి లేనివి తొలగింపు తప్పదు!

ఇది కూడా చదవండి…పాత లే ఔట్ల‌పై కబ్జాల జోరు – హైడ్రా ప్ర‌జావాణికి 49 ఫిర్యాదులు

ఈ చిత్రంపై భారత్‌తో పాటు అమెరికాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జో శర్మ 40 అమెరికన్ నగరాల్లో విస్తృత ప్రచార యాత్ర చేపట్టారు. ‘ఎం4ఎం’ మూవీకి ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులు అందాలని ఆమె కోరారు.