Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 18,2024: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన, పరిమాణంపరంగా ట్రాక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్ఈఎస్) కొత్తగా 6 వరుసల వరి నాట్ల ట్రాన్స్‌ప్లాంటర్ మహీంద్రా 6RO ప్యాడీ వాకర్‌ను ఆవిష్కరించింది.

కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4RO వాక్ బిహైండ్ ట్రాన్స్‌ప్లాంటర్ (MP461), 4RO రైడ్-ఆన్ (ప్లాంటింగ్ మాస్టర్ ప్యాడీ 4RO)లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఇప్పటికే కంపెనీకి ఆయా రాష్ట్రాల్లో మార్కెట్ లీడర్‌షిప్ ఉండగా, కొత్తగా మహీంద్రా 6RO ప్యాడీ వాకర్‌ను ప్రవేశపెట్టడమనేది వరి ట్రాన్స్‌ప్లాంటింగ్ టెక్నాలజీ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు తోడ్పడగలదు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వరి ఒక కీలక పంట. ప్రపంచ స్థాయి బియ్యం ఉత్పత్తిలోనూ, వరి సాగు యాంత్రీకరణ సాంకేతికతలను అందరికంటే ముందుగా అందిపుచ్చుకోవడంలోను ఈ రాష్ట్రాలు పేరొందాయి. ఇక్కడ పలు ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన వరి పండుతోంది.

వరి సాగులో లాభదాయకతను మెరుగుపర్చడంతో పాటు ఈ కొత్త సొల్యూషన్ అనేది ఇతరత్రా వ్యవసాయ కూలీలు ఎక్కువగా అవసరమయ్యే విధానాలతో పోలిస్తే వ్యవసాయ కూలీల ఖర్చులు తగ్గించడం సహా నీటిని సంరక్షించుకునేందుకు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగపడగలదు.

కొత్త మహీంద్రా 6RO ప్యాడీ వాకర్ అనేది ఆపరేటర్ సామర్ధ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. కచ్చితమైన, సమర్ధమంతమైన ప్లాంటింగ్‌కి ఉపయోగపడేలా, వరి సాగులో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా ఇది తీర్చిదిద్దబడింది.

మాన్యువల్‌గా ఆపరేట్ చేసే ఈ కొత్త ట్రాన్స్‌ప్లాంటర్ ఎంతో పొందికగా ఉంటుంది. సింగిల్ పాస్‌లో ఏకరూపతతో ఏకకాలంలో ఆరు వరుసల్లో నాట్లు వేసేందుకు వీలుగా ఇది చిన్న కమతాల్లో కూడా సులభతరంగా తిప్పేందుకు వీలుగా ఉంటుంది.

శక్తి, విశ్వసనీయత, పనితీరుపై ప్రధానంగా దృష్టి పెట్టి రూపొందించిన ఈ కొత్త ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్‌లో అత్యంత మన్నికైన గేర్‌బాక్స్, 4 లీటర్ల సామర్ధ్యం గల శక్తిమంతమైన ఇంజిన్ ఉంటాయి.

దీని వల్ల మరింత మెరుగైన పనితీరు కనపర్చడానికి, తక్కువ ఇంధన వినియోగానికి, వరి సాగులో ఉత్పాదకతను గరిష్ట స్థాయిలో పెంచేందుకు, సర్వీసింగ్‌ల మధ్య మరింత ఎక్కువ సమయం లభించడానికి వీలవుతుంది.

2 సంవత్సరాల పేబ్యాక్ పీరియడ్‌, 200 ఎకరాల కనీస ఆపరేటింగ్ ఏరియాతో రెంటల్ వ్యాపారాలకు కూడా ఈ కొత్త రైస్ ప్లాంటర్ చక్కగా ఉపయోగపడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విస్తృతంగా ఉన్న వ్యవసాయ యంత్రాల డీలర్ నెట్‌వర్క్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.

రైతులు ఇంటివద్ద కూడా సత్వర సర్వీసులు పొందవచ్చు. డోర్‌స్టెప్ సర్వీసులు సత్వరం, సులభతరంగా లభించేలా చూసేందుకు కొత్త యూజర్-ఫ్రెండ్లీ యాప్ ‘మహీంద్రా సాథీ’ ద్వారా పర్యవేక్షించవచ్చు.

కొత్త మహీంద్రా 6RO ప్యాడీ వాకర్‌తో పాటు మహీంద్రాకు చెందిన మొత్తం రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ల శ్రేణిని మహీంద్రా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అందించే బెస్ట్-ఇన్-క్లాస్ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో కూడా పొందవచ్చు.

Also read :Mahindra Launches its Revolutionary 6RO Paddy Walker Transplanter in Andhra Pradesh and Telangana Setting New Standards in Paddy Transplanting

Also read : JSW MG Motor India Partners with Tata Capital to enhance Channel Finance Options

ఇది కూడా చదవండి :గృహ రుణాల కోసం ఉద్యోగులు తప్పక అనుసరించతగిన మార్గదర్శకాలు..

Also read :Essential Guide to Home Loans for Salaried Employees

error: Content is protected !!