365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 20, 2025:సోష‌ల్ మీడియాలో నెగెటివిటీ రోజుకో రొజు పెరిగిపోతుంది. సెల‌బ్రిటీలను, సినిమాలను టార్గెట్ చేస్తూ ఈ నెగెటివిటీ చాలా ఎక్కువైపోతుంది.

దీనిపై బాహాటంగా మాట్లాడేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మన్ రీసెంట్‌గా నెగెటివిటీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ,

https://x.com/KChiruTweets/status/1880487367062311094?mx=2

“డియర్ తమన్,
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హృదయాల్ని తాకేలా ఉన్నాయ్. ఎప్పుడూ సరదాగా ఉండే నువ్వు ఇంత ఆవేదనతో మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ, మనసు ఎంత కలత చెందితే, నువ్వు అంతగా స్పందించావో అని భావించా.

సినిమా, క్రికెట్ లేదా మరేదైనా సామాజిక సమస్య విషయమై సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ, కానీ అవే మాటలు మనలో స్ఫూర్తిని నింపుతాయి.

అలాగే మనలను నాశనం కూడా చేస్తాయి. ఏమి కావాలో మీరు నిర్ణయించుకోండి. మనం పాజిటివ్‌గా ఉంటే, ఆ ఎనర్జీ మన జీవితాన్ని కూడా పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది.

Thoughtful words, my dear! God Bless!”