Fri. May 3rd, 2024
Waltair-Veerayya_365t

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 7,2023: మెగా ఫాన్స్ కు సంక్రాతి పండుగ ముందే వచ్చింది. ఇప్పటికే పూనకాలు లోడింగ్ సాంగ్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం’వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ట్రైలర్‌ లో ప్రతి బిట్‌ ఆసక్తికరంగా ఉంది. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే, మెగాస్టార్ చిరంజీవి యాక్షన్, కామెడీ తో అదరగొడతారనే అంచనాలు ట్రైలర్‌ చూశాక మరింతగా పెరిగాయి.

ఆకట్టుకునే కథాంశంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ట్రైలర్‌లో చూపారు. దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ యాక్షన్ అండ్ కామెడీలతో లోడ్ అయినట్లు గా ఉంది. ఇది అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రొమాన్స్ , చిరు స్టైల్ కామెడీ తో పాటు భావోద్వేగాలు కనిపించాయి.

యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన చిత్రంగా పక్కాగా అందరినీ మెప్పిస్తుందని ట్రైలర్ సూచిస్తోంది. “మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరుపెట్టిందే..ఆయన్ని చూసి.. రికార్డులో నాపేరు ఉండడం కాదు నా పేరు మీదే రికార్డులు ఉంటాయ్” అనే డైలాగ్స్ మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయ్.

Waltair-Veerayya_365t

బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకుడిగా మొదటిసారిగా చిరంజీవి అండ్ శ్రుతి హాసన్‌లతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ట్రైలర్‌ని బట్టి చూస్తే సినిమాలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

హాస్యం, హై-వోల్టేజ్ యాక్షన్, కలర్‌ఫుల్ రొమాన్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కూడిన పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ గా ఉంటుందనిపిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ, కేథరిన్ థ్రెసా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సాంకేతిక బృందం సినిమాటోగ్రాఫర్‌గా ఆర్థర్ ఎ. విల్సన్ , ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే ఉన్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ సంక్రాంతికి ముందు జనవరి 13న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.