Mon. Dec 23rd, 2024
Minister Kannababu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఫిబ్రవరి 17,2023: దరిద్రానికి డెఫినేషన్ చంద్రబాబు అని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019వరకు టీడీపీ పాలనలో తాగడానికి నీరులేక, ప్రాజెక్టులు నిండక, కరువు విలయతాండవం చేసిందని గుర్తు చేశారు.

2004కు ముందు కూడా చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అల్లాడిందన్నారు. చంద్రబాబు పాదం మోపితేనే కరువు, కాటకాలు, ప్రజల కష్టాలు తప్ప..ఏనాడైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు అంటనే దరిద్రంబాబు అని జనాలు ఫిక్సైపోయి 2019లో తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 2019 నుంచి వానలు పుష్కలంగా కురిశాయని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు.

Minister Kannababu

ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయేలా వరణుడు కరుణించాడని దీన్ని అదృష్టం అంటారని చెప్పుకొచ్చారు. జగన్ అంటే జనానికి అదృష్టం, టీడీపీ దరిద్రం అన్నారు. చంద్రబాబు ఇలాఖా కుప్పంలో పట్టుమని 10 ఎంపీటీసీలు గెలవలేకపోతే చంద్రబాబు దరద్రమే కదా అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా ఇంకా దరిద్రంతో క్షీణించిపోతుందన్నారు.

చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ప్రవాసాంధ్రుల మాదిరిగా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు హైదరాబాద్లో ఉంటూ ఏపీలో గెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఇళ్లు కట్టుకుని రాజకీయాలు చేయాలని, ఏకంగా టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు ముఖం పట్టుకుని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు.

నారా లోకేష్ తన పప్పు బ్రాండింగ్ నుంచి బయటపడేందుకు బూతులతో రెచ్చిపోతున్నాడని విమర్శించారు. ప్రజల్లో గెలవలేని లోకేష్ ఎక్కడా? ఒంటిచేత్తో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగన్ ఎక్కడా అని ప్రశ్నించారు. దున్నపోతులు, ఆంబోతులు, పశుప్రవృత్తి కలిగిన నాయకులంతా టీడీపీలోనే ఉన్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు.

error: Content is protected !!