365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 3,2025: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లనివిగా మారిన ఓట్లు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.సోమవారం ఓట్ల లెక్కింపులో భాగంగా తెరిచిన బ్యాలెట్ బాక్సుల్లో దాదాపు 20 శాతం ఓట్లు చెల్లనివిగా మారినట్టు గుర్తించారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది 25 బ్యాలెట్ పత్రాలతో ఓట్ల కట్టలను సిద్ధం చేస్తున్నారు.

బ్యాలెట్ పెట్టెలు తెరిచిన వెంటనే ప్రతి పెట్టెల్లో 20 శాతం ఓట్లు చెల్లనివిగా ఉన్నట్టు తేలింది. ప్రాధాన్యతా సంఖ్యలను మాత్రమే రాయాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు నంబర్లను గీతలు పెట్టడం, టిక్ మార్క్ వేయడం వంటి పొరపాట్లు చేశారు. ఈ విధంగా చెల్లని ఓట్లు పెరగడం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది.