365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 18,2025: ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ.జి.ఎల్), భారతదేశంలో అత్యంత ప్రముఖమైన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా పేరు పొందింది.
అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతను మిళితంగా పర్యావరణ అనుకూల ఆవిష్కరణలతో విద్యుత్ రవాణా (ఎలక్ట్రిక్ మొబిలిటీ) రంగంలో తనదైన ముద్ర వేసి, దేశ ఉపరితల రవాణా రంగాన్ని విద్యుత్తుతో ముందుకు నడిపిస్తోంది.
ఇటీవల, భారత్ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన “భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025″లో, ఒలెక్ట్రా తన తాజా ఆవిష్కరణలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం, కంపెనీ తన బ్రాండ్ విలువను పెంచుకోవడమే కాక, గ్లోబల్ స్థాయిలో తన ఉత్పత్తులను ప్రేరేపించడం, ఇండస్ట్రీ లీడర్లతో నెట్‌వర్క్ చేయడం, కీలక భాగస్వామ్యాలను పెంపొందించేందుకు దోహదపడింది.
ఈ ఎక్స్పోలో ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ చాసిస్, బ్లేడ్ బ్యాటరీ ప్లాట్‌ఫాం (12 మీటర్లు), సిటీ బస్ (9 మీటర్లు), కోచ్ బస్ (12 మీటర్లు) వంటి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించింది. ఈ ఆధునిక ఉత్పత్తులు, దేశంలో పర్యావరణ అనుకూల ప్రజా రవాణా అభివృద్ధిని ప్రేరేపిస్తాయి.

బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ:
ఓలెక్ట్రా చేసిన అద్భుతమైన ఆవిష్కరణలలో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అత్యంత ముఖ్యమైనది. ఈ బ్యాటరీలు అత్యుత్తమ పనితీరు, సమర్థత, నాణ్యత, భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయి.
వీటిని ధ్రువీకరించేందుకు నిర్వహించే నెయిల్ టెస్ట్ ,ఫ్యూరెన్స్ టెస్ట్ వంటి కఠిన పరీక్షలు కూడా సక్సెస్‌ఫుల్ గా పూర్తయ్యాయి. ఈ బ్యాటరీలను BYD కంపెనీ అభివృద్ధి చేసింది.
బ్లేడ్ బ్యాటరీ 30% ఎక్కువ శక్తి నిల్వను అందిస్తూ, ఒకే ఛార్జ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగేలా చేస్తుంది. ఈ బ్యాటరీ చిన్న పరిమాణం, తక్కువ బరువుతో ఉంటుందని వాహనంలో అధిక స్థలం మిగులుతుంది.
5000 సార్లు చార్జ్ చేయగల ఈ బ్యాటరీ విద్యుత్ వాహనాల కోసం అత్యుత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తిగా నిలుస్తుంది.
నూతన ఎలక్ట్రిక్ బస్సుల ఫీచర్లు:
ఓలెక్ట్రా బస్సులు ప్రయాణికుల సౌకర్యం,భద్రతను మెరుగుపరచేందుకు ఆధునిక ఫీచర్లతో రూపొందించాయి. ఇవి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ప్రయాణికుల కోసం USB చార్జింగ్ పోర్టులు, రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండిషనింగ్, కాంటిలీవర్ సీట్లు వంటి సౌకర్యాలు అందించాయి. ఇన్-వీల్ మోటార్లు, ఆధునిక బ్రేకింగ్ సిస్టమ్స్ వల్ల సులభమైన, భద్రమైన ప్రయాణం అందుతుంది.
ప్రయాణికుల భద్రత,సౌకర్యం ఓలెక్ట్రా డిజైన్ ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టములు (ADAS), GPS ట్రాకింగ్, CCTV కెమెరాలు వంటి ఫీచర్లతో మెరుగైన భద్రత అందించనుంది.
ఓలెక్ట్రా కేవలం ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో మాత్రమే కాకుండా, పర్యావరణ హిత అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తోంది. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో, ఒలెక్ట్రా పర్యావరణ సంబంధిత ప్రయాణాన్ని అందించడమే కాక, డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులతో మార్చి, డీజిల్ ఆదా చేస్తుంది, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
2024 సెప్టెంబర్ 30 నాటికి, ఒలెక్ట్రా 2,200 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ వాహనాలు 30 కోట్ల కిలోమీటర్లను ప్రయాణించి, 2.7 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాయి, ఇది 1.24 కోట్ల చెట్లను నాటిన దానికి సమానం.

ఓలెక్ట్రా, భారత్ లో ప్రతి కిలోమీటర్‌కు పర్యావరణ హిత ప్రయాణాన్ని అందించేందుకు కంకణం కట్టి, దేశంలో హరిత వెలుగుల కోసం ముందుకు సాగుతోంది.