Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,మే7,2023: ఈ ఐదు స్కూటర్లు భారతదేశంలో విపరీతంగా అమ్ముడవుతున్నాయి.. అంతేకాదు వీటికే చాలా డిమాండ్ ఉంది. ఈ జాబితాలో యాక్టివా మొదటి స్థానంలో ఆక్రమించింది. దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇది. మీరు దీన్ని రూ. 75,347 నుంచి రూ. 81,348 ఎక్స్-షోరూమ్ ధరతో ఇంటికి తీసుకురావచ్చు.

రెండవ స్థానంలో ఉన్న స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్. ఇది మహిళా రైడర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. బరువు పరంగా కాస్త తేలికగా ఉంటుంది. మీరు దీన్ని రూ. 69,638 నుంచి రూ. 78,538 వరకు ఎక్స్-షోరూమ్ ధరకే కొనొచ్చు. https://www.honda2wheelersindia.com/products/scooter

ఈ జాబితాలో మూడవ పేరు TVS జూపిటర్. ఇది చాలా అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంది. దీని ధర రూ. 72,190 నుంచి రూ. 88,498 వరకు ఉంటుంది. 110cc సెగ్మెంట్లో పోటీకి వచ్చిన హీరో జూమ్ స్కూటర్ నాలుగో స్థానంలో ఉంది. ఇది కూడా ప్లెజర్ వలె తేలికగా ఉంటుంది. దీని ధర రూ. 69,099 నుంచి రూ. 77,199 వరకు ఎక్స్-షోరూమ్ ధరలో ఉంటుంది. https://www.honda2wheelersindia.com/products/scooter

ఈ జాబితాలో ఐదవ స్కూటర్ హోండా డియో. ద్విచక్ర వాహనదారులకు కూడా ఇది చాలా ఇష్టం. ఈ స్కూటర్‌ను రూ.68,625 నుంచి రూ.72,626 వరకు ధరలో కొనుగోలు చేయవచ్చు.

error: Content is protected !!