365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,జూన్ 18,2024:అంతర్జాతీయంగా సోలార్ పరిశ్రమ పురోగతికి చేస్తున్న అపార కృషికి గాను తమ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ చిమన్‌లాల్ దోషి గ్లోబల్ సోలార్ లీడర్స్ అవార్డ్ (2024) పురస్కారాన్ని అందుకున్నారని వారీ ఎనర్జీస్ సగర్వంగా తెలియజేస్తోంది.

2024 జూన్ 13-15 మధ్య చైనాలోని షాంఘైలో నిర్వహించిన SNEC 17వ ఇంటర్నేషనల్ ఫొటోవోల్టెయిక్ పవర్ జనరేషన్ అండ్ స్మార్ట్ ఎనర్జీ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్‌లో ఈ పురస్కార ప్రదానం జరిగింది.

2023 జూన్ 30 నాటికి మొత్తం 12 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో వారీ ఎనర్జీస్ లిమిటెడ్ భారత్‌లో సోలార్ పీవీ మాడ్యూల్స్ ఉత్పత్తికి సంబంధించి అతి పెద్ద తయారీ సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది (మూలం: CRISIL నివేదిక).

నూతన ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ, అంతర్జాతీయంగా ప్రభావితం చేయడం వంటి అంశాల్లో మరింతగా కృషి చేయడంలో ఎనర్జీస్ లిమిటెడ్‌కి గల నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలుస్తుంది. పర్యావరణహిత ఇంధన సొల్యషన్స్ కోసం అనువైన వ్యవస్థను ప్రోత్సహిస్తూ, పురోగామి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును కూడా ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుంది.

ఈ గుర్తింపు దక్కడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మనం చేస్తున్న కృషికి గుర్తింపు లభించినప్పుడు సహజంగానే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. ఎంత కష్టమైనా ఆ బాటలో ముందుకు సాగేలా ప్రేరణ కలిగిస్తుంది. ఈ పురస్కారం వ్యక్తిగతంగా నాకు మాత్రమే కాకుండాశ్రేష్టత,నవకల్పనల సాధనలో వారీ ఎనర్జీస్ లిమిటెడ్‌కి గల నిబద్ధతకు కూడా దక్కిన గౌరవం.

ఇది యావత్ వారీ కుటుంబ సమష్టి కృషికి లభించిన గుర్తింపు. అంతర్జాతీయంగా భారతీయ సోలార్ పరిశ్రమకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనగా నిలవగలదని విశ్వసిస్తున్నాను.

కొత్త శిఖరాలను అధిరోహిస్తూపునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్‌తో భవిష్యత్‌ను పర్యావరణహితమైనదిగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగేందుకు మాకు ఇది ప్రేరణగా నిలవగలదు అని వారీ ఎనర్జీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ చిమన్‌లాల్ దోషి తెలిపారు.

శ్రీ హితేష్ చిమన్‌లాల్ దోషి ,పరివర్తనాత్మక నాయకత్వానికి అలాగే ఇంధన పరివర్తనకు చోదకశక్తిగా నిలవడంలోనూ, భారత్‌లో సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడంలోనూ ఆయనకు గల నిబద్ధతకి గ్లోబల్ సోలార్ లీడర్స్ అవార్డ్ (2024) నిదర్శనంగా నిలుస్తుంది.

అధునాతన తయారీ ప్లాంట్లు, అంతర్జాతీయంగా కార్యకలాపాలతో ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ,  ఆర్థిక వృద్ధి సాధన లక్ష్యంగా వారీ ఎనర్జీస్ ఇకపైనా పురోగమిస్తుంది.

Mr. Hitesh Doshi, CMD of Waaree Energies Limited, Recognized as Global Solar Leader at SNEC 2024 

Also read :Marico Innovation Foundation Invites Applications for 10th Edition of Innovation for India Awards

ఇది కూడా చదవండి :వరి నాట్లకు సంబంధించి కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ విప్లవాత్మకమైన 6RO ప్యాడీ వాకర్ ట్రాన్స్‌ప్లాంటర్‌ను ఆవిష్కరించిన మహీంద్రా..

Also read :Mahindra Launches its Revolutionary 6RO Paddy Walker Transplanter in Andhra Pradesh and Telangana Setting New Standards in Paddy Transplanting

Also read : JSW MG Motor India Partners with Tata Capital to enhance Channel Finance Options

ఇది కూడా చదవండి :గృహ రుణాల కోసం ఉద్యోగులు తప్పక అనుసరించతగిన మార్గదర్శకాలు..

Also read :Essential Guide to Home Loans for Salaried Employee