Thu. Jun 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఏప్రిల్ 26,2023:రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ,ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ తన ఉద్యోగులకు సహాయం చేయడానికి ఎప్పుడూ అండగా నిలుస్తారు.

ముఖేష్ అంబానీ ఇటీవల తన మాజీ ఉద్యోగి కోసం రూ.1,500 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు. అతన్ని అంబానీకి ‘రైట్ హ్యాండ్’ గా భావిస్తారు. రిలయన్స్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ 22 అంతస్తుల భవనాన్ని బహుమతిగా ఇచ్చారు.

అంబానీకి ‘రైట్ హ్యాండ్’గా పిలుచుకునే మనోజ్ మోదీ.. కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు. అతను రిలయన్స్ ఉద్యోగి మాత్రమే కాదు, ముఖేష్ అంబానీకి స్నేహితుడు కూడా.

రిలయన్స్ డీల్స్ అన్నీ విజయవంతం కావడం వెనుక మనోజ్ మోడీ హస్తం ఉంది. సంవత్సరాలుగా, అతను చాలా చిత్తశుద్ధితో ,అంకితభావంతో సంస్థ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు.

ముఖేష్ అంబానీ మాత్రమే కాదు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ కూడా మనోజ్ మోడీ చెప్పే ప్రతి విషయాన్ని నమ్ముతున్నారు. మనోజ్ మోదీ చేసిన సేవలకుగాను గుర్తింపుగానే ముఖేష్ అతనికి అరుదైన బహుమతి అందించారు.