365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, అక్టోబర్ 31,2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.400 కోట్లు కావాలని బెదిరింపు అది ఇమెయిల్ వచ్చిందని పోలీసులు మంగళవారం తెలిపారు.
అంబానీ కంపెనీకి సోమవారం ఈమెయిల్ వచ్చింది. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈ ఇమెయిల్ అని ఓ అధికారి తెలిపారు.
అంతకుముందు, శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు కోరుతూ మొదటి ఇమెయిల్ రావడంతో పారిశ్రామికవేత్త సెక్యూరిటీ ఇన్‌చార్జి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇక్కడ గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
శనివారం కంపెనీకి రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఇమెయిల్ వచ్చింది.
కంపెనీకి సోమవారం మూడవ ఇమెయిల్ వచ్చింది, ఇందులో డిమాండ్‌ని రెట్టింపు చేశారని అధికారి తెలిపారు.
ముంబయి పోలీసులు, వారి క్రైమ్ బ్రాంచ్ ,సైబర్ బృందాలు ఇమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
అంబానీ, అతని కుటుంబ సభ్యులకు హత్య చేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ ద్వారా చేసినందుకు గత సంవత్సరం, ముంబై పోలీసులు బీహార్ లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
ముంబయిలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని పేల్చివేస్తామని నిందితులు మరో సారి బెదిరించారు.ఇప్పుడు ఇమెయిల్స్ ద్వారా నిందితులు ముఖేష్ అంబానీని బెదిరిస్తున్నారు