Wed. May 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జాతీయ,డిసెంబర్ 30,2021:ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 63,91,282 డోసులతో కలిపి, 143.83 కోట్ల డోసులను ( 1,43,83,22,742 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,53,47,226 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు1,03,87,375
రెండో డోసు97,01,876
 ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిమొదటి డోసు1,83,85,386
రెండో డోసు1,68,75,942
 18-44 ఏళ్ల వారుమొదటి డోసు49,76,01,405
రెండో డోసు32,67,56,163
 45-59 ఏళ్ల వారుమొదటి డోసు19,40,91,039
రెండో డోసు14,90,18,597
 60 ఏళ్లు పైబడినవారుమొదటి డోసు12,11,54,096
రెండో డోసు9,43,50,863
మొత్తం1,43,83,22,742

గత 24 గంటల్లో 7,486 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,42,58,778 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 98.38 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 63వ రోజు కూడా 15,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13,154 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 82,402. మొత్తం కేసుల్లో పాజిటివ్ కేసులు 0.24 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,99,252 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 67.64 కోట్లకు పైగా ( 67,64,45,395 ) పరీక్షలు నిర్వహించారు.వారపు పాజిటివిటీ రేటు 0.76 శాతంగా ఉంది. గత 46 రోజులుగా 1 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.10 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 87 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 122 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.