Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నీమ్రానా, నవంబర్‌ 24, 2021 ః ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన ప్రపంచంలో అభ్యాసాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా లాభాపేక్ష లేని  నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ 13 వ వార్షిక ఉపన్యాస సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో  న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ పూర్వ అధ్యక్షులు శ్రీ కె వీ కామత్‌ ప్రసంగించారు.  నవంబర్‌ 20, 2021 తేదీ న ఆన్‌లైన్‌లో జరిగిన ఈ వార్షిక కార్యక్రమంలో డిజిటల్‌ ఇండియా, డిజిటల్‌ కరెన్సీలు, ఆర్థిక వృద్ధి పై కామత్‌ ప్రసంగించారు.

ఈ సందర్భంగా కామత్‌ మాట్లాడుతూ  డిజిటల్‌గా సాధికారిత కలిగిన సమాజంలో భారతదేశాన్ని సమూలంగా మార్చడంలో డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఏ విధంగా తోడ్పడుతుందో వెల్లడించారు. గత కొద్ది సంవత్సరాలుగా, డిజిటల్‌ సాంకేతికత అనేది భారతదేశపు ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడంలో అత్యంతకీలక పాత్ర పోషిస్తుందంటూ ఎన్‌యు లాంటి సంస్థలు భావి నాయకులను తీర్చిదిద్దుతున్నాయన్నారు.

NIIT University (NU) deliberates on how Digital India can script a success  story at the 13th Annual Lecture - Higher Education Digest

ఈ వార్షిక ఉపన్యాసం నిట్‌ యూనివర్శిటీ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌ హ్యాండిల్స్‌పై ప్రత్యక్ష ప్రసారమైంది.

నిట్‌ యూనివర్శిటీ ఫౌండర్‌ రాజేంద్ర ఎస్‌ పవార్‌ మాట్లాడుతూ ‘‘నేటి ప్రపంచంలో  భవిష్యత్‌కు సిద్ధంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ ఫౌండేషన్‌ కావాల్సి ఉంది. మహమ్మారి నాటి ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ఈ ఫలితంగానే, మీ ఉద్యోగం ఏదనేదానితో సంబంధం లేకుండా మీరంతా కూడా నూతన తరపు సాంకేతిక వేదికలు, పద్థతులు, డిజిటల్‌ ఉపకరణాల పట్ల అవగాహన మెరుగుపరచాల్సి ఉంది. ఎన్‌యు వద్ద, మేము ఉన్నత విద్యలో నూతన ప్రమాణాలను సృష్టించడంతో పాటుగా ఆవిష్కరణలను సైతం ప్రోత్సహిస్తున్నాము’’ అని అన్నారు.

నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ ‘‘డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ కు కోవిడ్‌–19 ఓ వరంలా మారింది. దేశం డిజిటల్‌గా మారడంలో గణనీయమైన పాత్రనూ పోషించింది. ఎన్‌యు వద్ద మేము నూతన తరపు సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా విద్యార్థుల భవిష్యత్‌కు అవసరమైన సాంకేతికతలనూ తీసుకువస్తున్నాం’’ అని అన్నారు.